IPL 2021: పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ విడుదల.. ఆర్‌సీబీ పాత జెర్సీని కాపీకొట్టారంటున్నఫ్యాన్స్!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సందడి మొదలైంది. మరో 10 రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. దాంతో ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహకాలను షురూ చేశాయి. ఇప్పటికే ఆటగాళ్ల క్వారంటైన్‌ను ముగించుకొని ప్రాక్టీస్ క్యాంప్‌లు మొదలెట్టేసాయి. సోషల్ మీడియా వేదికగా తమ క్యాంపైన్‌ను కూడా ప్రారంభించాయి. నయా జెర్సీలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2021 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ తమ కొత్త జెర్సీని విడుదల చేసింది. మంగళవారం ట్విటర్ వేదికగా నయా జెర్సీకి సంబంధించిన వీడియోను పంచుకుంది.
బంగారు వర్ణంలో..
ప్రస్తుత జెర్సీ ఎరుపు రంగులో ఉండి అంచుల వెంట బంగారు వర్ణంలో చారలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ జెర్సీలో.. సింహం గుర్తు కింద కూడా ఉండే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. జెర్సీకి తగ్గట్లే బంగారు వర్ణంలో ఉండే హెల్మెట్లను పంజాబ్ బ్యాట్స్మెన్లు ధరించనున్నారు. కేకేఆర్, ఆర్‌సీబీ తర్వాత గోల్డెన్ కలర్ హెల్మెట్లను వినియోగించనున్న మూడో జట్టు పంజాబే. ఈ ఏడాది పేరు మార్చుకున్న పంజాబ్(గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్) అన్ని విభాగాల్లోనూ సమూల మార్పులతో రాబోయే సీజన్‌కు సన్నద్ధమవుతోంది. ముంబై వేదికగా ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ తలపడనుంది.
కాపీ కొట్టడానికి సిగ్గుండాలి...
అయితే ఈ జెర్సీని కాపీ కొట్టారంటూ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పాత జెర్సీ అంటూ ట్వీట్ చేస్తున్నారు. సొంత జెర్సీని తయారు చేసుకోలేక కాపీ కొట్టినందుకు సిగ్గుండాలని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. 'కాకతాళీయయో ఏమో కానీ ఆర్‌సీబీ పాత జెర్సీని పంజాబ్ కాపీకొట్టగా.. ఆ జట్టు ఈ సీజన్‌లో ఎక్కువగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగానే ఆడనుంది.'అని కామెంట్ చేశారు. ఆర్‌సీబీ-పంజాబ్ కింగ్స్ తో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఏప్రిల్ 9 నుంచి షురూ..
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది. ఒక్క మ్యాచ్ కూడా తన సొంత మైదానంలో ఆడే అవకాశం ఏ జట్లకూ లేదు. టోర్నీలో మ్యాచ్‌ల్నీ అన్ని జట్లూ తటస్థ వేదికల్లోనే ఆడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications