న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: తెలుగోడికి మళ్లీ అన్యాయమే.. అశ్విన్‌కు దక్కని చోటు! మండిపడుతున్న ఫ్యాన్స్!

Twitter Slams Rahul Dravid For R Ashwin’s Omission From India’s Playing XI vs England in 5th Test

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు సిద్దమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ట్ స్టోక్స్ మైదాన పరిస్థితుల నేపథ్యంలో బౌలింగ్‌కు మొగ్గు చూపాడు. ఇక కరోనా వైరస్ సోకడంతో ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. దాంతో భారత జట్టును జస్‌ప్రీత్ బుమ్రా నడిపి‌స్తున్నాడు. అందరూ ఊహించనట్లుగానే రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసే బాధ్యతను టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా తీసుకున్నాడు. శుభ్‌మన్‌గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దాంతో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి మార్గం సుగుమమైంది. ఇంగ్లండ్ మాదిరే టీమిండియా సైతం నాలుగు పేసర్లతో పాటు ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. దాంతో రవిచంద్రన్ అశ్విన్‌కు మొండి చెయ్యి ఎదురైంది.

అశ్విన్‌కు అవకాశం ఇవ్వరా?

స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చాడు. ఇక రోహిత్ శర్మ స్థానంలో తెలుగు యువ క్రికెటర్ కేఎస్ భరత్ ఆడుతాడని అంతా భావించారు. కానీ అతనిపై టీమ్‌మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచలేదు. దాంతో అభిమానులు టీమిండియా మేనేజ్‌మెంట్ తీరును తప్పుబడుతున్నారు. కీలక మ్యాచ్‌కు రవిచంద్రన్ అశ్విన్ తీసుకోకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఫామ్‌లో ఉన్న అశ్విన్‌ను కాదని జడేజాను తీసుకోవడం ఘోర తప్పిదమని కామెంట్ చేస్తున్నారు.

ఆ జట్టు ఎంతో నయం..

ఈ జట్టు కంటే హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు బాగుందని సెటైర్లు పేల్చుతున్నారు. అసలు పుజారాకు ఎన్ని అవకాశాలు ఇస్తారని, అతను బంతులను ఆపడం ఆపి పరుగులు చేస్తే బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ ఎంపిక కూడా సరైంది కాదంటున్నారు. కనీసం శార్దూల్ ఠాకూర్ స్థానంలోనైనా అశ్విన్‌ను ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోకుంటే చాలా గొప్ప విషయమని ఎగతాళి చేస్తున్నారు.

ఈ అనుభూతి వర్ణించలేనిది..

ఈ అనుభూతి వర్ణించలేనిది..

ఇక టీమిండియాకు కెప్టెన్సీ వహించడం గొప్ప విషయమని, ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని జస్‌ప్రీత్ బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఇంతకన్నా మధురమైన క్షణం మరొకటి లేదన్నాడు. ఈ మ్యాచ్‌ కోసం అద్భుతంగా సన్నదమయ్యామని చెప్పిన బుమ్రా.. ప్రాక్టీస్ మ్యాచ్‌తో ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటుపడ్డామని చెప్పాడు. ఇది తమను మానసికంగా మరింత బలంగా మార్చిందని చెప్పాడు. గతేడాది ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన ఈ మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌ను ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ చివరి మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా.. సిరీస్ భారత్‌దే అవుతోంది.

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
తుది జట్లు:

తుది జట్లు:

భారత్ : శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)

ఇంగ్లండ్: అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్(కీపర్), జాక్ లీచ్, మ్యాటీ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Story first published: Friday, July 1, 2022, 17:28 [IST]
Other articles published on Jul 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X