Ishan Kishan: నిన్ను తక్కువ అంచనా వేసార్రా బుడ్డోడా.. డబుల్ సెంచరీతో అందరి కళ్లు తెరిపించావ్..!

ఛటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. గాయంతో దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. ఈ అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో కెరీర్‌లో తొలి వన్డే శతకంతో పాటు ద్విశతకాన్ని అందుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ చరిత్రకెక్కాడు. ముస్తాఫిజుర్ వేసిన 35 ఓవర్ చివరి బంతికి క్విక్ సింగిల్ తీసి ఇషాన్ ఈ ఘనతను అందుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(3) విఫలమైనా.. విరాట్ కోహ్లీతో కలిసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.
126 బంతుల్లోనే డబుల్ సెంచరీ..
ముఖ్యంగా తొలి రెండు వన్డేల్లో భారత స్టార్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఎబాదత్ హోస్సెన్, మెహ్‌దీ హసన్, షకీబ్ అల్ హసన్‌లను చెడుగుడు ఆడాడు. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన ఇషాన్.. మరో 36 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. మరో 18 బంతుల్లోనే 150 పరుగుల మార్క్ ధాటిన ఇషాన్.. మరో 23 బంతుల్లో ద్విశతకం నామోదు చేశాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ బాది సెంచరీ దిశగా దూసుకెళ్తుండటంతో టీమిండియా 36 ఓవర్లలో భారత్ 305 పరుగులు చేసింది.
ఫ్యాన్స్ ఫిదా..
విధ్వంసకర సెంచరీ బాదిన ఇషాన్ కిషన్‌పై నెటిషన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో తొలి వన్డే నుంచి ఇషాన్ కిషన్‌ను ఆడించినా అయిపోవని కామెంట్ చేస్తున్నారు. నిన్ను తక్కువ అంచనా వేసార్రా బుడ్డోడా అంటూ.. ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఒక్క ఇన్నింగ్స్‌తో శిఖర్ ధావన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేసావని, మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడితే రిషభ్ పంత్ కథ కూడా ముస్తుందని జోస్యం చెబుతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో దూకుడుగా ఆడటం ఇషాన్ కిషన్ అదనపు బలమని, అతన్ని జట్టులో కొనసాగించాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు.
పంత్ కంటే ఎంతో నయం..
రిషభ్ పంత్ కంటే ఇషాన్ కిషన్ చాలా బెటరని, అతని అమ్ముల పొదిలో చాలా షాట్లు ఉన్నాయని తెలుపుతున్నారు. బంగ్లా స్పిన్నర్లను అతను ఎదుర్కొన్న విధానమే ఇషాన్ కిషన్ ఎంతటి క్వాలిటీ బ్యాటరో అనే విషయం తెలియజేస్తుందని కామెంట్ చేస్తున్నారు. రిషభ్ పంత్ తరహా మద్దతు అతనికి లభిస్తే స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతాడని జోస్యం చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications