For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11.. నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్!

Twitter reacts with funny memes after Dream11 bags title sponsorship of IPL 2020

ముంబై: ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ ఫామ్‌ 'డ్రీమ్‌ 11' ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) -2020 టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులు సొంతం చేసుకోవడంపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. సెటైరికల్ కామెంట్స్‌తో ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ ఏడాది కోసం టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్‌ 11 బీసీసీఐకి రూ. 222 కోట్లు చెల్లించనుంది. స్పాన్సర్‌షిప్‌ కోసం వేసిన బిడ్లను మంగళవారం తెరవగా...అందరికంటే ఎక్కువగా బిడ్‌ వేసిన డ్రీమ్‌ 11కు ఈ అవకాశం దక్కింది. రెండో స్థానంలో బైజూస్‌ (రూ. 201 కోట్లు), అన్‌ అకాడమీ (రూ. 170 కోట్లు) నిలిచాయి. వచ్చే ఏడాది స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు 'వివో' తిరిగి రాకపోతే తర్వాత రెండేళ్లు కూడా డ్రీమ్‌ ఎలెవన్‌కు స్పాన్సర్‌షిప్‌ హక్కులు ఇవ్వనుంది.

మస్త్ పైసలున్నాయి..

మస్త్ పైసలున్నాయి..

ముఖ్యంగా కరోనా టైమ్‌లో ఇంత పెద్ద మొత్తానికి బిడ్ దాఖలు చేయడం.. అది కూడా భారత కంపెనీ కావడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘ఏయ్ ఎవరన్నారురా.. భారత్‌లో డబ్బులు లేవని, గరీబ్ దేశమని.. మస్త్ పైసలున్నాయి.'అని ఒకరంటే.. ఇంకొందరు బాబా రాందేవ్ పతంజలి కంపెనీని ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. టైటిల్ స్పాన్సర్‌ కోసం ప్రయత్నించిన ఆ కంపెనీ.. చివరకు బిడ్ వేయకుండానే తప్పుకుంది. ఎవరు రాకుంటే వేద్దామనుకున్నామని బాబా రాందేవ్ ప్రకటించడం హస్యాస్పదమైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

రజనీ స్టైల్లో మీమ్స్..

రజనీ స్టైల్లో మీమ్స్..

ఇక టైటిల్ స్పాన్సర్‌షిప్ గెలుచుకున్న డ్రీమ్ 11.. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్లో.. ఇతర కంపెనీలను ఎగతాళి చేస్తున్నట్లు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ‘ఏ జియో.. పతంజలి, బైజూస్.. డబ్బులు లేవా..?'అని రజనీ ప్రశ్నిస్తున్నట్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. డ్రీమ్ 11 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ అని ఆనందపడకండి.. ఆ కంపెనీ మన జేబులకు చిల్లుపెడుతుంది తస్మాత్ జాగ్రత్తా..? అని హెచ్చరిస్తున్నారు. అలాగే ఐపీఎల్‌కు డ్రీమ్‌కు పెళ్లైందని, స్పాన్సర్ షిప్ రేసులో డ్రీమ్ 11 ఉసెన్ బోల్ట్ తరహాలో పరుగెత్తిందనే మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు.

ఐపీఎల్ కోసమే రూ. 500 కోట్లు

ఐపీఎల్ కోసమే రూ. 500 కోట్లు

వ్యాపార వర్గాల సమాచారం మేరకు ఐపీఎల్ 2020 సీజన్ కోసం డ్రీమ్ 11 పెట్టబోయే ఖర్చు రూ. 500 కోట్లు దాటిందని తెలుస్తోంది. టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం రూ.222 కోట్లు చెల్లించనున్న ఆ సంస్థ.. ప్రకటనల కోసం స్టార్ స్పోర్ట్స్‌కు రూ.120-140 కోట్లు చెల్లించనుంది. అలాగే ఆరు ఐపీఎల్ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఈ జట్లన్నిటికీ ఎంత లేదన్నా.. ఓ రూ.150 కోట్లు ఖర్చు పెట్టనుంది. దీంతో ఆ కంపెనీ ఇన్వెస్ట్ మెంట్ రూ. 500 కోట్లు దాటనుంది.

ఇదో ఆన్‌లైన్ జూదం..

ఇదో ఆన్‌లైన్ జూదం..

డ్రీమ్‌ 11, మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్, మై 11 సర్కిల్, బల్లేబాజీ, మై టీమ్‌ 11, స్కిల్‌ ఫర్‌ ట్యూన్‌... పేరు ఏదైతేనేం... అన్నీ ఊరించి ఊబిలోకి దింపే తరహా ఫాంటసీ స్పోర్ట్స్‌ లీగ్‌లే! మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడం మొదలు ఇది వ్యసనంగా మారే వరకు అన్ని కంపెనీలది దాదాపు ఒకే శైలి. సరిగ్గా చెప్పాలంటే ‘భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా'కు ఇది ఆధునిక మొబైల్‌ వెర్షన్‌ మాత్రమే.! ముందుగా అవి ఉచితంగా ఆడే అవకాశం కల్పిస్తాయి. ఆ తర్వాత కొంత డబ్బు చెల్లించి సభ్యులుగా మారితే ఎక్కువగా ఆడే అవకాశం ఉందంటూ ఆఫర్లు... ఆపై ప్రతీ ఆట (మ్యాచ్‌)కు కనీస మొత్తం చెల్లించిన తర్వాతే అందులో భాగమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.

ఎంతో మంది దీనికి అలవాటు

ఎంతో మంది దీనికి అలవాటు

క్రికెట్‌ లేదా మరే క్రీడపైనైనా తనకు ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతోనే డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో ఎంతో మంది దీనికి అలవాటు పడిపోతున్నారు. తమను తాము సదరు క్రీడలో పెద్ద అనుభవజ్ఞులైన విశ్లేషకులుగా భావించి వేసుకుంటున్న అంచనాలతో లెక్క తప్పడం, ఆపై పెద్ద మొత్తంలో నష్టపోవడం తరచుగా జరిగిపోతున్నాయి.

Story first published: Wednesday, August 19, 2020, 20:49 [IST]
Other articles published on Aug 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+