For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK లొల్లి షురూ.. ప్రపంచకప్ జెర్సీపై ఇండియా పేరు ముద్రించని పాక్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Twitter reacts on Pakistan T20 WC jerseys sport UAE 2021 instead of India 2021
T20 World Cup : Pak Writes UAE 2021 Instead Of India 2021 On Their T20 WC Jersey || Oneindia Telugu

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్.. అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. దాయాదీల పోరంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది. ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మెగా మ్యాచ్‌కు చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య లొల్లి అప్పుడే మొదలైంది. మెగాటోర్నీ కోసం సిద్దం చేసిన పాకిస్థాన్‌ జెర్సీ.. కొత్త వివాదానికి తెరలేపింది.

 ఇండియా పేరు ముద్రించని పాక్..

ఇండియా పేరు ముద్రించని పాక్..

వాస్తవానికి ఈ టీ20 ప్రపంచకప్ భారత్ వేదికగా జరగాల్సింది. కానీ కరోనా కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) యూఏఈకి తరలించింది. యూఏఈకి తరలినా ఆతిథ్య హక్కులు మాత్రం భారత్‌ దగ్గరే ఉన్నాయి. మ్యాచ్‌లు యూఏఈ, ఓమన్ వేదికగా జరుగుతున్నా.. ఆర్గనైజ్ చేసేది మాత్రం బీసీసీఐనే. ఆతిథ్య హక్కులు కూడా భారత్‌వే. సాధారణంగా మెగాటోర్నీలకు ఉపయోగించే జెర్సీలపై ఆతిథ్య దేశం పేరును ముద్రిస్తారు. అయితే ఈ మెగా టోర్నీలో యూఏఈ వేదికగా జరుగుతుండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. తమ దేశ జెర్సీలపై ఇండియాకు బదులు యూఏఈ అని రాసుకొచ్చింది. ఇది నిబంధనలకు విరుద్దం. అయితే ఈ జెర్సీలను అధికారికంగా పీసీబీ ప్రకటించాల్సి ఉంది.

 నిబంధనల మేరకు..

నిబంధనల మేరకు..

ఈ జెర్సీలకు సంబంధించిన ఫొటో షూట్ జరగ్గా.. వాటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పాక్ టీమ్ జెర్సీలపై ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్ యూఏఈ అని రాసుంది. అయితే ఇదే మెగా టోర్నీ కోసం సిద్దమవుతున్న నెదర్లాండ్ టీమ్ మాత్రం తమ జెర్సీలపై ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఇండియా అని రాసుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు.. పీసీబీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకొని పాకిస్థాన్ జెర్సీలపై ఇండియా పేరు ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల మేరకు అన్ని జట్లు నడుచుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

10 సెకన్లకు రూ. 25-30 లక్షలు..

10 సెకన్లకు రూ. 25-30 లక్షలు..

ఈ మ్యాచ్ ద్వారా స్టార్ భారీ మొత్తంలో అడ్వర్టైజింగ్ రెవెన్యూ పొందాలని చూస్తోంది. ఇందులో భాగంగా మెగా మ్యాచ్ మధ్యలో వచ్చే యాడ్స్‌కు భారీ రేటు ఫిక్స్ చేసింది. పది సెకన్ల యాడ్ స్లాట్‌కు రూ.25-30 లక్షల వరకు వసూలు చేస్తుందని సమాచారం. స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు సంబంధించి భారత టెలివిజన్ చరిత్రలోనే ఓ యాడ్‌కు ఇంత మొత్తం వసూలు చేయడం ఇదే తొలిసారి అని అడ్వర్టైజ్‌మెంట్ ఇండస్ట్రీ వర్గాలు చెబతున్నాయి. యాడ్ ధర భారీగా ఉన్నప్పటికీ స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే పలు కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

టికెట్లన్నీ సేల్..

టికెట్లన్నీ సేల్..

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే భారత్-పాక్ జట్లు తలపడుతున్నాయి. దాంతో మెగాటోర్నీలో జరిగే మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. టీ20 ప్రపంచకప్ కోసం టిక్కెట్ల విక్రయం ప్రారంభం కాగా.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఎవరూ ఊహించని విధంగా టిక్కెట్లు ఓ గంటలోనే అమ్ముడుపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నా.. టిక్కెట్లు గంటలోనే అమ్ముడుపోవడం విశేషం. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు దాయాదుల పోరుకు ఎంత క్రేజ్ ఉందొ.

Story first published: Thursday, October 7, 2021, 23:11 [IST]
Other articles published on Oct 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+