IND vs WI: గోల్డెన్ డక్‌తో రోహిత్ శర్మ చెత్త రికార్డు! వడపావ్ ఎఫెక్ట్ అంటూ ఫ్యాన్స్ సెటైర్స్!

సెయింట్ కిట్స్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(0) తీవ్రంగా నిరాశపరిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఒబెడ్ మెక్‌కాయ్ వేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే రోహిత్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఊరించే షార్ట్ పిచ్ బాల్‌తో హిట్‌మ్యాన్‌ను మెక్‌కాయ్ బోల్తా కొట్టించాడు. బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్‌కు టెంప్ట్ అయిన రోహిత్ మూల్యం చెల్లించుకున్నాడు. భారీ షాట్‌కు ప్రయత్నించగా బ్యాక్ వర్డ్ పాయింట్ ఫీల్డర్ అకీల హోస్సెన్ చేతిలో పడింది. ఎక్స్‌ట్రా బౌన్స్ హిట్ మ్యాన్ కొంపముంచింది. దాంతో గోల్డెన్ డక్‌గా భారత కెప్టెన్ పెవిలియన్ బాట పట్టాడు.
చెత్త రికార్డు..
అయితే ఈ పేలవ ప్రదర్శనతో రోహిత్ శర్మ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు గోల్డెన్ డక్ ఔట్ అయిన రెండో ఓపెనర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 4 సార్లు డకౌట్ అయిన శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్షాన్ నాలుగు సార్లు గోల్డెన్ డకౌటై అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆరోన్ ఫించ్, జాసన్ రాయ్‌లు సైతం మూడు సార్లు డకౌటై రోహిత్‌తో సమంగా నిలిచారు. ఇక ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఔటైన మూడో భారత బ్యాటర్‌గా కూడా రోహిత్ అప్రతిష్టను మూట కట్టుకొన్నాడు.
మూడో బ్యాటర్‌గా..
2016లో కేఎల్ రాహుల్.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఔటయ్యాడు. ఆ తర్వాత 2021లో శ్రీలకంతో పృథ్వీ షా ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌కే వెనుదిరిగాడు. తాజాగా ఈ జాబితాలోకి రోహిత్ చేరాడు. ఇక గోల్డెన్ డకౌట్ అయిన రోహిత్ శర్మపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. లెఫ్టార్మ్ పేసర్‌తో రోహిత్ శర్మకు విడదీయని బంధం ఉందని సెటైర్లు పేల్చుతున్నారు.
వడపావ్ ఎఫెక్ట్..
రోహిత్ శర్మ గోల్డెన్ డకౌటవ్వడానికి మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవ్వడమే కారణమని, ఈ మూడు గంటల టైమ్‌లో రోహిత్ వడాపావ్‌లు లాగించేసాడని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. తొలి బంతికే ఔటైన రోహిత్.. 19.5 ఓవర్ల పాటు ప్రేక్షకుడిగా కూర్చోవాలని, ఆ తర్వాత 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయాలని కామెంట్ చేస్తున్నారు. ఈ కష్టం పగోడికి కూడా రావద్దని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అసలే మ్యాచ్ ఆలస్యం అయిందంటే.. అందులో రోహిత్ ఔటవ్వడం నిరాశకు గురి చేసింది. మ్యాచ్ చూడటం దండుగ అంటూ కామెంట్ చేస్తున్నారు.
తప్పని పరాజయం..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో ఫోర్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. బ్యాటర్లంతా విఫలయ్యారు. ఒబెడ్ మెక్‌కాయ్ (6/17) సిక్సర్‌తో భారత్ పతనాన్ని శాసించాడు. మెక్‌కాయ్ 6 వికెట్లతో పాటు హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హోస్సెన్, జోసఫ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్(52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68)హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవన్ థామస్(19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జడేజా, అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications