For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#PlayBold to #KhelnaChhod: ఆర్‌సీబీ ఓటమిపై ట్విట్టర్‌లో జోకులు

By Nageshwara Rao
Twitter Reactions: Knight Riders trump as Royal Challengers yet again fail to put up a fight

హైదరాబాద్: ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. టోర్నీలో ఓవైపు సన్‌రైజర్స్‌ తక్కువ స్కోరును కాపాడుకుంటుంటే, బెంగళూరు మాత్రం అందుకు భిన్నంగా వెళుతోంది. పసలేని బౌలింగ్‌.. పేలవ ఫీల్డింగ్‌‌తో వరుస పరాజయలను చవిచూస్తోంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఆదివారం సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కోల్‌కతా ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (62 నాటౌట్‌) హాఫ్ సెంచరీకి తోడు రాబిన్ ఊతప్ప (36) దూకుడగా ఆడటంతో బెంగళూరుపై కోల్‌కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (68 నాటౌట్‌), మెకల్లమ్‌ (38) పరుగులతో రాణించారు. కోల్‌కతా బౌలర్లలో రసెల్ మూడు వికెట్లు తీసుకోగా, కుల్దీప్ యాదవ్‌ ఒక వికెటీ తీశాడు.

అనంతరం 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనకు లభించిన లైఫ్‌ని క్రిస్ లిన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కోల్‌కతా విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో క్రిస్ లిన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు బెంగళూరు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమిపాలై, కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఓటమిపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుతున్నారు.

Story first published: Monday, April 30, 2018, 16:18 [IST]
Other articles published on Apr 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+