#BCCIPolitics ట్రెండింగ్.. సాహా సంచలన ఆరోపణలు.. బోర్డుపై మండిపడుతున్న ఫ్యాన్స్!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీలంకతో జరగనున్న అప్ కమింగ్ టెస్ట్ సిరీస్‌కు భారత సెలెక్టర్లు సాహాను ఎంపిక చేయలేదు. దాంతో మీడియా ముందుకు వచ్చిన అతను రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయాలని టీమ్‌మేనేజ్‌మెంట్ సూచించిందని, భవిష్యత్‌లో తనకు జట్టులో చోటు దక్కదనే విషయాన్ని ముఖం మీదే చెప్పిసిందన్నాడు.
కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో గాయంతో కీలక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ జట్టులో చోటు గురించి భరోసా ఇచ్చాడని, కానీ ఇంతలోనే పరిణామాలన్నీ మారిపోయాయన్నాడు. ఇక ఇంటర్వ్యూ ఇవ్వాలని ఓ జర్నలిస్ట్ బలవంతం చేశాడని ట్వీట్ చేశాడు. దాంతో నెటిజన్లు బోర్డుతో పాటు సదరు జర్నలిస్ట్‌పై మండిపడుతున్నారు.
ట్రెండింగ్‌లో #BCCIPolitics
బీసీసీఐలో రాజకీయాలు జరుగుతున్నాయి అంటూ ట్విటర్ వేదికగా నెటిజన్లు వరుసగా పోస్టులు పెడుతున్నారు. అతని విషయంలో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వ్యవహరించిన తీరు సరికాదని మండిపడుతున్నారు. సాహాను తొలగించడానికి కారణం చెప్పబోమని, అది సెలెక్షన్ కమిటీ నిర్ణయం అని చేతన్ పేర్కొనడంతో నెటిజన్లు అతడిపైనా, ఆ జర్నలిస్టుపైనా, టీమిండియామేనేజ్‌మెంట్‌పైనా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో #BCCIPolitics #Wriddhiman Saha, #BCCI అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
ద్రవిడ్ ముందే చెప్పాడని..
రిటైర్మెంట్ గురించి ఓ నిర్ణయాన్ని తీసుకోవాలంటూ మేనేజ్‌మెంట్ తనను సూచించిందని వృద్ధిమాన్ సాహా తేల్చి చెప్పారు. కొందరు సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ కొత్త వికెట్ కీపర్ కోసం ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు తెలిపాడని, జట్టులో తనకు చోటు దక్కదనే విషయం అప్పుడే అర్థమైందని పేర్కొన్నారు. తనను జట్టులోకి తీసుకోలేకపోవడానికి ప్రధాన కారణం- వయస్సు లేదా ఆటతీరు కానే కాదని ద్రవిడ్ చెప్పారని అన్నారు.

మీడియాకు ఎలా తెలిసిందో..
జట్టులో యువ ప్లేయర్లను తీసుకోవాలనే ఉద్దేశంతో తనను తప్పించినట్లు కనిపిస్తోందని సాహా అభిప్రాయపడ్డాడు. రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయాలని ద్రవిడ్ సైతం సూచించారని పేర్కొన్నారు. సౌతాఫ్రికా పర్యటనను ముగించుకుని వచ్చిన సమయంలో తన భార్య ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని, కొంతకాలం కుటుంబంతో గడపాలని తాను నిర్ణయించుకున్నానని సాహా చెప్పారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైందని వ్యాఖ్యానించారు. తాను రంజీ మ్యాచ్‌లల్లో ఆడకూడదని నిర్ణయించుకున్న విషయం మీడియాకు ఎలా లీక్ అయిందో అర్థం కావట్లేదని అన్నారు.
జర్నలిస్ట్ బెదరింపులు..
ఇక వరుస పరిణామాల నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ తనను ఇంటర్వ్యూ ఇవ్వాలని దబాయించడాని సాహా ట్వీట్ చేశాడు. సదరు జర్నలిస్ట్ చాటింగ్ స్క్రీన్ షాట్స్‌ను ట్వీట్‌కు జత చేశాడు. సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు అందించిన సేవలకు నాకు దక్కిన గౌరవం ఇదేనంటూ క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. దాంతో నెటిజన్లు సదరు జర్నలిస్ట్‌పై మండిపడుతున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ బొరియా మజూందారే సాహాను బెదిరించాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. అతనొక్కడే you స్పెల్‌ను ypuగా రాస్తాడని కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications