Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇన్నాళ్లు కోహ్లీపై ఏడ్చారు.. ఇప్పుడేం మాట్లాడుతార్రా హేటర్స్! భారత కెప్టెన్ సంచలన నిర్ణయంపై ఫ్యాన్స్ రియాక్షన్

Twitter reactions after Virat Kohli announces decision to step down as T20I skipper
Virat Kohli తప్పుకున్నాడా తప్పించారా ? చాలా తెలివిగా నిర్ణయం T20I Skipper |Reactions|Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని తెలిపాడు. పని భారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని, టెస్ట్, వన్డే‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నాడు. కెప్టెన్‌గా తన ప్రయాణంలో సహకరించిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. సన్నిహితులు, లీడర్‌షిప్ గ్రూప్‌లోని కీలక సభ్యులైన హెడ్ కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జైషాతో పాటు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నాడు.

నిరాశలో ఫ్యాన్స్..

ఇక విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయంపై అతని ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా.. క్రికెట్ పెద్దలు, రోహిత్ అభిమానులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ నిర్ణయంపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే భిన్నంగా స్పందించాడు. కోహ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని తాను అస్సలు ఊహించలేదన్నాడు. ఆర్‌సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటాడని, తద్వారా కెప్టెన్‌గా అతనికి రెండు నెలల విశ్రాంతి లభిస్తుందని భావించానన్నాడు. ఏది ఏమైనప్పటికీ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం.. టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌గా అతన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ప్రపంచకప్‌తో చాంప్..

టీ20 ప్రపంచకప్‌కు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ.. భారత జట్టును ఉన్నత స్థాయిలో నిలబెట్టే సామర్థ్యం కోహ్లీకి ఉందని మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌తోనే నీ కెప్టెన్సీ ముగుస్తుంది స్కిప్ అంటూ మరో అభిమాని కామెంట్ చేశాడు. ఇక కోహ్లీ అభిమానులు టీ20ల్లో విరాట్ సాధించిన ఘనతలను గుర్తు చేస్తున్నారు. కోహ్లీ సారథ్యంలో భారత్ 45 టీ20 మ్యాచ్‌లు ఆడి 27 గెలిచిందని, 14 మ్యాచ్‌ల్లోనే ఓడిందని గుర్తు చేస్తున్నారు. విజయాల శాతం 65.11గా ఉందని పేర్కొంటున్నారు. దురదృష్టవశాత్తు కోహ్లీ కెప్టెన్సీ అందుకున్న కొత్తలో ఒక్క ప్రపంచకప్ లేదని, బ్యాట్స్‌మన్‌గా అప్పుడు అతను మంచి పీక్‌లో ఉన్నాడని, టీ20 ప్రపంచకప్‌తోనే కెప్టెన్సీ ముగిస్తాడని మరో అభిమాని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఫిట్‌నెస్ ఫ్రీక్..

జట్టుకు ఎన్నో విజయాలందించిన విరాట్ కోహ్లీ ఇలా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం బాలేదని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. కోహ్లీ నిర్ణయానికి ముందే పకడ్బందీ ప్లాన్ చేశారని, మెంటార్‌గా ధోనీని నియమించడంతో పాటు రోహిత్ శర్మను సిద్దం చేశారని, ఇది జట్టుపై ఎలాంటి ప్రభావం చూపదని ఇంకో అభిమాని అభిప్రాయపడ్డాడు. విరాట్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని, జట్టు కోసం అహర్నీషులు కష్టపడే కోహ్లీ సారథిగా సక్సెస్ అయ్యాడని, ఫిట్‌నెస్ విషయంలో జట్టులో సమూల మార్పులు తీసుకొచ్చాడని ఓ బిగ్ సెలెబ్రిటీ ప్రశంసించింది.

వ్యూహాత్మక అడుగు..

కోహ్లీ చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నాడని, కేవలం క్రికెట్ గురించే మాట్లాడుకునేలా చేశాడని మరో మాజీ క్రికెటర్ ట్వీట్ చేశాడు. అనవసర చర్చల జోలికి వెళ్లకుండా తానే టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని వెల్లడించి మెగా టోర్నీ ముందు వ్యూహాత్మకంగా అడుగువేసాడని కొనియాడాడు. ఇన్నాళ్లు కెప్టెన్సీ నుంచి తొలగించాలని కోహ్లీపై ఏడ్చిన హేటర్స్ ఇప్పుడేం మాట్లాడుతారని భారత కెప్టెన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కోహ్లీ సారథ్యంలో భారత్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకలపై సిరీస్‌లు గెలిచిందని వారు గుర్తు చేస్తున్నారు. గత 10 టీ20 సిరీస్‌ల్లో కోహ్లీ సారథ్యంలోని భారత్ 9 గెలిచిందని అతని కెప్టెన్సీ రికార్డులు గుర్తు చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ టీ20 కెప్టెన్సీ జాబితాలో విరాట్ మూడో స్థానంలో ఉన్నాడని కూడా గుర్తు చేస్తున్నారు.

Story first published: Thursday, September 16, 2021, 20:00 [IST]
Other articles published on Sep 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+