IPL 2021 Auction: కేదార్ జాదవ్‌ను ఎవడ్రా తీసుకోమన్నది.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఫైర్!

హైదరాబాద్: ఊహించినట్లుగానే ఐపీఎల్ 2021 వేలం అదిరిపోయింది. బడా కార్పొరేట్ల మధ్య జరిగిన మినీ 'మనీవార్'లో ఆటగాళ్ల తలరాత మారిపోయింది. హార్డ్ హిట్టర్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. తమ రాత మారుస్తాడుకున్న ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించాయి. గతాన్ని పక్కనబెట్టి.. ఫ్యూచర్‌ను పక్కాగా లెక్కలేస్తూ.. ఊహలకు అందని రేట్లతో క్రికెటర్లను ఎగరేసుకుపోయాయి.
చిన్నోడా.. పెద్దోడా.. స్వదేశా.. విదేశా.. అనే తేడా లేకుండా సత్తా ఉంటే చాలనే రీతిలో కాసుల వర్షం కురిపించాయి. ఫలితంగా లక్షలే చాలనుకున్న కుర్ర క్రికెటర్లు సైతం సింగిల్ నైట్‌లో కోట్లకు పడగలెత్తారు. మొత్తం వేలంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ జాక్ పాట్ కొట్టాడు. అయితే ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వెటరన్ క్రికెటర్ కేదార్ జాదవ్‌ను తీసుకోవడంపై హైదరాబాద్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమ్‌మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.
రూ. కోట్లకు కేదార్ జాదవ్..
జట్టులోని మూడు ఖాళీ స్థానాలను సన్‌రైజర్స్ హైదరాబాద్ భర్తీ చేసింది. ఎవరూ పెద్దగా ఆసక్తి కనబర్చిన కేదార్ జాదవ్‌ను అతని కనీస ధర రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. విదేశీ కోటాలో ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కోటిన్నరకు తీసుకుంది. మరో దేశవాళీ లెఫ్టార్మ్ స్పిన్నర్ జగదీష సుచిత్‌ను రూ.30 లక్షలకు తీసుకుంది. మనీ పర్స్ భాగానే ఉన్నా స్టార్ల కోసం సన్‌రైజర్స్ పోటీపడలేదు. ముఖ్యంగా విదేశీ స్టార్లతో నిండి ఉన్న జట్టుకు దేశవాళీ ఆటగాళ్లను తీసుకోవాలనే ఆలోచనే చేయలేదు. కృష్ణప్ప గౌతమ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకుందామని ప్రయత్నించినా.. వారి ధర అమాంతం పెరగడంతో ఏం చేయలేకపోయామని టీమ్‌మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు.
హైదరాబాదీకి నోచాన్స్..
హైదరాబాద్‌కు చెందిన ఆటగాళ్లను ఒక్కరిని కూడా తీసుకోలేదు. గతేడాది భావనక సందీప్‌ను తీసుకున్న హైదరాబాద్.. ఈ సారి అతన్ని వదిలేసింది. అతని స్థానంలో మరో ఆటగాడిని కనీస ధరకు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. దీనిపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్నా డెక్కన్ చార్జర్స్ జట్టే నయమని, కనీసం ఓ ముగ్గురు, నలుగురిని ఆటగాళ్లనైనా తీసుకునేదని కామెంట్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ సైతం అసహనం వ్యక్తం చేశాడు. 'సన్‌రైజర్స్ జట్టులో, హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడికి కూడా స్థానం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది'' అని ట్వీట్ చేశాడు.
కేదార్ జాదవ్ ఎందుకు..?
గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన కేదార్ జాదవ్‌ను ఎవరు తీసుకోమన్నారని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాదవ్ సరిగ్గా ఆడటం లేదనే చెన్నై సూపర్ కింగ్స్ వదులుకుందని, అతను మంచి ఆటగాడైతే ధోనీ ఎందుకు వదులుతాడని ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఎలా వేలానికి వెళ్లారని సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఏ ఫ్రాంచైజీ కూడా అతని కోసం పోటీ పడలేదని, అతని ప్లేస్‌లో హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా టెస్ట్ ప్లేయర్ హనుమ విహారిని తీసుకున్నా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కనీసం స్థానిక ఆటగాడికి అవకాశం ఇచ్చారనే ఆసక్తి ఉండేదంటున్నారు.
ఇండియన్ బ్యాట్స్‌మెన్..
హైదరాబాద్ జట్టు పూర్తిగా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడి ఉందని, ఆ సమస్య తగ్గించడానికి సీనియర్ ఇండియన్ బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాల్సిందని కామెంట్ చేస్తున్నారు. మిడిలార్డర్‌లో సత్తా చాటే కరుణ్ నాయర్, షారుఖ్ ఖాన్, శివం దూబే వంటి ఆటగాళ్లపై గురిపెట్టాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జట్టులో విదేశీ ఆటగాళ్లంతా బెంచ్‌కే పరిమితమవుతున్నారని, మళ్లీ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను అంత ధర పెట్టి కొనడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రణాళిక లోపంతో వేలంలో పాల్గొన్నారని మండిపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications