పాకిస్థాన్‌లో రోహిత్ శర్మ.. అవాక్కైన ఫ్యాన్స్! ముంబైని గెలిపించేందుకే దాయాదీ దేశానికి హిట్ మ్యాన్!

హైదరాబాద్: హెడ్డింగ్ చూసి మీరు అవాక్కయ్యారా? ఐపీఎల్ 2021 సెకండాఫ్ ఆడుతున్న రోహిత్ శర్మ.. పాకిస్థాన్ ఎప్పుడు వెళ్లాడని జుత్తు పీక్కుంటున్నారా? అయితే ముందుగా అంతగా ఆలోచించడం ఆపండి. రోహిత్ శర్మ.. ఏం పాకిస్థాన్ వెళ్లలేదు. కానీ అతని పోలి ఉన్న వ్యక్తి పాకిస్థాన్‌లో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మనిషిని పోలిన మనిషి ఈ భూమి మీద ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. అది నిజమో అబద్దమో తెలియదు కానీ.. అచ్చం రోహిత్ శర్మను పోలీ ఉన్న ఓ వ్యక్తి మాత్రం పాకిస్థాన్‌లో కనిపించాడు. ఓ షాప్ దగ్గరు జ్యూస్ తాగుతూ కనిపించిన ఆ వ్యక్తిని ఫొటో తీసిన అభిమాని పాకిస్థాన్‌లో రోహిత్ శర్మ అంటూ ట్వీట్ చేశాడు. దాంతో ఆ ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది.
జ్యూస్ తాగడానికి
ఈ ఫొటోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ.. సరదాగా కామెంట్ చేస్తున్నారు.'అంతర్జాతీయ క్రికెటర్లు పర్యటించడానికి పాకిస్థాన్ సురక్షితం కాదని ఎవరు చెప్పారు? ఇప్పుడే స్టార్ ఇండియన్ ప్లేయర్ రోహిత్ శర్మ, రావల్పిండి సద్దర్ వద్ద ఆలు బుఖారా జ్యూస్ తాగాడం చూశాను" అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. ముంబై ఇండియన్స్‌ను దారిలో పెట్టేందుకు పాక్ ఆటగాళ్ల సలహాలు తీసుకోవడానికి వెళ్లాడని మరో అభిమాని సెటైర్ పేల్చాడు. వరుస ఓటముల ఒత్తిడిని తగ్గించుకునేందుకు పాకిస్థాన్‌లో జ్యూస్ తాగడానికి వెళ్లాడని మరో అభిమాని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
భద్రతా కారణాలతో...
2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు జరిపిన దాడితో పాక్‌లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశం కూడా సాహం చేయలేదు. అయితే గతేడాది శ్రీలంకనే మళ్లీ పాక్‌లో పర్యటించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ కూడా పర్యటించింది. ఇక 18 ఏళ్ల తర్వాత పాక్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ సరిగ్గా మ్యచ్ ప్రారంభానికి ముందు భద్రతా కారణాలతో టూర్ నుంచి తప్పుకుంది. న్యూజిలాండ్ బాటలోనే ఇంగ్లండ్ టీమ్ కూడా పాక్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే రోహిత్ డూప్ పాక్‌లో కనబడటంపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతన్నారు.

క్లిష్ట పరిస్థితుల్లో ముంబై ..
ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపరం కొనసాగుతోంది. హ్యాట్రిక్ పరాజయాలతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. టోర్నీలో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెవాల్సిన పరిస్థితి రోహిత్ సేనది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలోను కంగుతిన్నది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలోను చిత్తుగా ఓడింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ వైఫల్యం కొంపముంచుతుంది. రోహిత్ శర్మ, డికాక్ మినహా అంత సతమతమవుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications