మొన్న థర్డ్ అంపైర్.. నిన్న జోర్డాన్.. సూర్య నీ ‘బ్యాడ్ లక్’కు దండాలయ్యా! (వీడియో)

అహ్మదాబాద్: టీ20 వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా సాగిన సిరీస్‌లో టీమిండియా దుమ్మురేపింది. ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చినా.. ఆఖరి ఫైట్‌లో మాత్రం చెలరేగిపోయింది. కుర్రాళ్లతో భిన్నమైన లైనప్‌ను ఎంచుకుని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దాంతో శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో కోహ్లీ సేన 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.
ఫలితంగా ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఔటైన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. బౌండరీ లైన్ వద్ద క్రిస్ జోర్డాన్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

వెంటాడిన దురదృష్టం..
వరుస మ్యాచ్‌ల్లో సూర్యను బ్యాడ్ లక్ వెంటాడింది. ఇటీవల ముగిసిన నాలుగో టీ20లో థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరిన సూర్యకుమార్ యాదవ్.. శనివారం జరిగిన ఐదో టీ20లో బౌండరీ లైన్ వద్ద క్రిస్ జోర్డాన్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కు నిరాశగా వెనుదిరిగాడు. దాదాపు సిక్స్‌గా వెళ్లిన బంతిని ఒంటిచేత్తో అందుకున్న క్రిస్ జోర్దాన్.. చాకచక్యంగా బంతిని సమీపంలోని మరో ఫీల్డర్ జాసన్ రాయ్‌కు అందించాడు. దాంతో జోరుమీదున్న సూర్యకుమార్ యాదవ్‌కు నిరాశ తప్పలేదు.
లాంగాన్ నుంచి దూసుకొచ్చి..
భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆదిల్ రషీద్ వేసిన 14వ ఓవర్‌లో రెండో బంతిని గూగ్లీ రూపంలో సంధించగా.. సూర్య డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఇక లాంగాన్ నుంచి దూసుకొచ్చిన జోర్డాన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే వేగంలో తాను బౌండరీని దాటే ప్రమాదం ఉండటంతో బంతిని పక్కనే ఉన్న జాసన్ రాయ్‌వైపు విసిరాడు. రాయ్ బంతిని అందుకోవడంతో సూర్య వెనుదిరిగాడు. స్కోరు బోర్డులో సూర్య క్యాచ్ అందుకున్నట్లు జోర్డాన్ పేరు లేకపోయినా ఈ క్యాచ్ అతనిదే. బంతిని అందుకున్న సమయంలో రాయ్ నవ్విన తీరు ఈ క్యాచ్ ఎంత అసాధారణమో చూపించింది.
సూర్య.. నీ బ్యాడ్‌లక్‌కు దండాలయ్యా..
ఇక సోషల్ మీడియా వేదికగా ఓవైపు ఈ క్యాచ్‌పై ప్రశంసల జల్లు కురుస్తుండగా.. మరోవైపు సూర్యకుమార్ యాదవ్‌పై సానుభూతి వ్యక్తమవుతోంది. దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ సూర్యకుమార్ యాదవేనని, అతనికి ఏది కలిసిరావడం లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 'ఏన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత సెకండ్ టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగెపెట్టే అవకాశం వస్తే.. అందులో బ్యాటింగే రాలేదు.
ఇక మూడో టీ20లో రోహిత్ శర్మ రాకతో జట్టులో చోటే గల్లంతయ్యింది. నాలుగో టీ20లో వచ్చిన అవకాశాన్ని అందుకున్న సూర్య.. హాఫ్ సెంచరీతో చెలరేగితే.. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా అర్థాంతరంగా వెనుదిరిగాడు. ఆఖరి టీ20లో తన ఫామ్ కొనసాగిస్తూ చెలరేగుతున్న సూర్య.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్‌కు చిక్కి నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇవన్నీ చూస్తుంటే సూర్య కంటే దురదృష్టవంతుడు మరొకరు ఉండరేమో'అని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.

అదరగొట్టిన భువీ..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 నాటౌట్), రోహిత్ శర్మ (34 బంతుల్లో4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులే చేసి ఓటమిపాలైంది.
డేవిడ్ మలాన్ (46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), జోస్ బట్లర్ (34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు 52) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో పొదుపైన బౌలింగ్‌తో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' భువనేశ్వర్ (2/15) జట్టును గెలిపించాడు. భారత కెప్టెన్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications