For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Chris Gayle: క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడు.. విండీస్ వీరుడా మజాకా!

Twitter praises Chris Gayle becomes first cricketer to score 14000 runs in T20s

న్యూఢిల్లీ: యూనివర్స బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్న యూనివర్స్ బాస్.. తాజాగా 14 వేల పరుగుల మైలు రాయి అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో సోమవారం అర్థరాత్రి జరిగిన మూడో టీ20లో ఈ విండీస్ వీరుడు మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 38 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కులు చూపించాడు.

భారీ సిక్సర్‌తో..

భారీ సిక్సర్‌తో..

ఆడమ్ జంపా వేసిన 9వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన గేల్.. 14 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్ బరిలోకి దిగే యూనివర్స్ బాస్ 431 టీ20 మ్యాచ్‌ల్లో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అతనికి దరిదాపుల్లో కూడా మరే ఆటగాడు లేడు. గేల్ సాధించిన ఘనత చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. గేల్ తర్వాత మరో విండీస్ వీరుడు కీరన్ పోలార్డ్ 545 మ్యాచ్‌ల్లో 10836 రన్స్ చేశాడు. షోయబ్ మాలిక్(10,741), డేవిడ్ వార్నర్(10,017), విరాట్ కోహ్లీ (9,235)లు ఉన్నారు.

గేల్.. టీ20 సచిన్!

అరుదైన ఘనత సాధించిన క్రిస్ గేల్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో పాటు దిగ్గజ క్రికెటర్లు, అభిమానులు యూనివర్స్ బాస్‌ను కొనియాడుతున్నారు. టీ20 ఫార్మాట్‌లో క్రిస్ గేల్ సచిన్‌ను తలపిస్తున్నాడని కామెంట్ చేస్తూ.. 'Sachin Tendulkar of T20s'అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. సచిన్ వన్డే, టెస్ట్ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. మెరిడిత్ బౌలింగ్‌లో గేల్ ఔటైనా..అతని మెరుపు హాఫ్ సెంచరీ, 14 వేల పరుగుల మార్క్‌ను ఆపలేకపోయారని ఐసీసీ ట్వీట్ చేయగా.. 7 సిక్సర్లతో ఇరగదీసాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రశంసించింది.

పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ ఖుషి..

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌కు ముందు క్రిస్ గేల్ ఫామ్‌లోకి రావడంపై పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. యూనివర్స బాస్ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సైతం గేల్ విధ్వంసాన్ని కొనియాడుతూ వరుస ట్వీట్లు చేసింది. అంతేకాకుండా నికోలస్ పూరన్ ఫామ్‌లోకి రావడాన్ని కూడా ప్రస్తావించింది. ఈ ఇద్దరు కలిసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

సిరీస్ విండీస్ కైవసం..

సిరీస్ విండీస్ కైవసం..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (31 బంతుల్లో 2ఫోర్లతో 30), హెన్రిక్స్ ( 29 బంతుల్లో 2 సిక్స్‌లతో 33) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 142 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 14.5 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. క్రిస్ గేల్(38 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67), నికోలస్ పూరన్ (32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఫలితంతో విండీస్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

Story first published: Tuesday, July 13, 2021, 11:41 [IST]
Other articles published on Jul 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+