ఓ కోహ్లీ సేన.. ఫొటోలకి పోజులు తర్వాత కానీ ముందు ప్రాక్టీస్ చేయండి!!

క్రైస్ట్‌చర్చ్: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఓటమిని భారత అభిమానులు ఏ మాత్రం అంగీకరించలేకపోతున్నారు. వరల్డ్ నెంబర్ వన్ జట్టు పేలవ ఆటతీరును సహించలేకపోతున్నారు. ఇప్పటికే పీకల దాక కోపం మీదున్న వారికి.. భారత క్రికెటర్లు ఇషాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో.. పుండు మీద కారం చల్లినట్లైంది. దీంతో తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా వెళ్ల గక్కుతున్నారు.
ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే?
తొలి టెస్టు ఓటమి అనంతరం వెల్లింగ్టన్ నుంచి భారత్.. రెండో టెస్టు వేదికైన క్రైస్ట్‌చర్చ్‌కు చేరుకుంది. ఈ విషయాన్నితెలియజేస్తూ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్‌తో దిగిన ట్రావెల్ ఫొటోను ఇషాంత్ శర్మ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అదే ఫొటోను మయాంక్ కూడా షేర్ చేశాడు.
ట్రావెల్ డైరీస్, ఎన్ టూరేజ్, ఆన్ ద గో, టీమిండియా అనే పదాలను హ్యాష్‌ట్యాగ్ చేశాడు. ఈ ఫొటోలోఆటగాళ్లు అదిరేటి డ్రెస్సులతో మోడల్స్‌గా తయారై ఉన్నారు. ఈ ఫొటోను చూసిన భారత ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చింది.
ఆడటానికా? లేక విహారయాత్రకా?
ఈ పోస్టుపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నెటిజన్ అయితే మీరు ప్రాక్టీస్‌కు కెళుతున్నారా.. లేక న్యూజిలాండ్‌లో పర్యటించడానికి వెళుతున్నారా అని ఒకరు ఘాటుగా ప్రశ్నించాడు. ఫొటోలు పోజులు తర్వాత ఇవ్వండి కానీ.. ముందు అయితే ప్రాక్టీస్ చేయండని మరొకరు కామెంట్ చేశారు. ఓడిన మీకు సోషల్ మీడియాలో రాక్ స్టార్స్‌లా ఫొటోలు షేర్ చేసే సీన్ లేదని ఇంకొకరు చురకలంటించారు.
ఇండియన్ గర్ల్‌తో మ్యాక్స్‌వెల్ ఎంగేజ్‌మెంట్!!
షాపింగ్‌కు కాదు..
న్యూజిలాండ్‌కు షాపింగ్ కోసం వెళ్లలేదని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా కాస్త కష్టపడాలని సూచించారు. అలాగే తొలి టెస్టులో బ్యాట్స్‌మెన్ వైఫల్యం చెందారని, ఇప్పటికైనా సరిగ్గా ప్రాక్టీస్ చేసి రెండోటెస్టులో సత్తాచాటాలని సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికైనా ఇలా తిరగడం మానివేసి, ప్రాక్టీస్ సెషల్‌లో ఒళ్లు వంచాలని పేర్కొన్నారు. మరో నెటిజన్ భారత ఆటగాళ్లను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. పరుగులు చేయాలని సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications