Kulcha ఈజ్ బ్యాక్.. ఇక లంకకు దబిడి దిబిడే! ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

హైదరాబాద్: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఇద్దరూ చోటు దక్కించుకున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కుల్చా జోడీ ఓ వన్డే మ్యాచ్‌లో కలిసి బరిలోకి దిగుతోంది. దాంతో భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జోడికి ఈ టూర్ మంచి అవకాశమని, ఇక్కడ సత్తా చాటి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఈ ఇద్దరు కలిసి చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్చా జోడీ దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరిని ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చితక్కొట్టారు.
వన్డే ప్రపంచకప్ తర్వాత..
ఆ మ్యాచ్‌లో చాహల్ 10 ఓవర్లు వేసి 88 రన్స్ ఇచ్చుకోగా.. కుల్దీప్ ఓవికెట్‌తో 72 రన్స్ సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరికి మళ్లీ కలిసి ఆడే అవకాశం దక్కలేదు. చాహల్ టీమ్‌లో కొనసాగినా కుల్దీప్ పూర్తిగా బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో వరుణ్ చక్రవర్తికి కేకేఆర్ ప్రాధాన్యత ఇవ్వడంతో కుల్దీప్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఆసీస్ పర్యటనలో, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఓ మ్యాచ్ ఆడినప్పటికీ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతని కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ శ్రీలంక పర్యటనతో మళ్లీ ఈ జోడీకి మంచి అవకాశం దక్కింది.
ఫ్యాన్స్ ఖుషీ..
కుల్చా జోడీ అవకాశం దక్కడంపై నెటిజన్లు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లకెన్నాళ్లు కుల్చా జోడీకి చాన్స్ అని ఒకరంటే.. ఈ ఇద్దరు కలసి బరిలోకి దశాబ్దకాలం అయిన ఫీలింగ్ కలుగుతుందని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. చాహల్‌తో కలిసి ఆడినప్పుడు కుల్దీప్ యావరేజ్.. లేకుండా ఆడిన సగటును మరో అభిమాని ట్వీట్ చేశాడు. దాంతో Kulcha ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటి వరకు 63 వన్డేలు ఆడిన కుల్దీప్ యాదవ్ 107 వికెట్లు తీయగా.. చాహల్ 54 వన్డేల్లో 92 వికెట్లు తీశాడు.
ఇషాన్, సూర్య అరంగేట్రం
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్ తరఫున ఇషాన్ కిషన్, సూర్యుకుమార్ యాదవ్ అరంగేట్రం చేశారు. శ్రీలంక తరఫున భానుక రాజపక్స అరంగేట్రం చేశాడు. ధావన్‌కు జతగా పృథ్వీషాకు అవకాశం దక్కగా.. ఊహించనట్లుగానే సంజూ శాంసన్‌కు మొండిచేయ్యే ఎదురైంది. అతను కాలిగాయంతో బాధపుడుతున్నాడని, అందుకే సెలెక్ట్ చేయలేదని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. ఎప్పటికప్పుడూ మెడికల్ టీమ్ అతని గాయం పురోగతిని పరిశీలిస్తున్నాయని తెలిపాయి. ఇక ముందుగా ఊహించినట్లే కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్‌కు అవకాశం దక్కింది.

చెలరేగిన కుల్చా..
ఇక ఈ మ్యాచ్‌లో కుల్చా జోడీ చెలరేగుతోంది. పేసర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయారు. ఓపెనర్లు అవిష్కా ఫెర్నాండో(32), మినోద్ భానుక(27)నిలకడగా ఆడుతుండటంతో ధావన్ చాహల్‌ను రంగంలోకి దింపి ఫలితం రాబట్టాడు. తన తొలి బంతికే చాహల్... అవిష్కా ఫెర్నాండోను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతిని ఫెర్నాండో ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే అందుకున్నాడు. ఆతర్వాత కుల్దీప్ ఒకే ఓవర్‌లో భానుక రాజపక్స(24), మినోద్ భానుక(27) పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బ తీశాడు. దాంతో లంక 89 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications