మ్యాచ్‌లన్నీ ఓడిపోతుంటే ఈ పిల్ల ఆటలేందిరా? ముందు ఆ లచ్చిగాడినీ దొబ్బెయ్యండి! సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఫైర్!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడి 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కటే గెలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఐదింటిలో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడిన సన్‌రైజర్స్.. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తయింది. 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్ స్లో బ్యాటింగ్ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరుతో ఆ టీమ్ ఫ్యాన్స్ ఆశలు వదులుకున్నారు. తీవ్ర నిరాశకు గురువుతున్నారు.
సహనం కోల్పోయిన సన్‌రైజర్స్ ఫ్యాన్స్..
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ టీమ్ బాండింగ్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ యాక్టివిటీలో టీమ్ ప్లేయర్సంతా చిన్న పిల్లల్లా ఇండోర్ గేమ్స్ ఆడారు. దాగుడు మూతలు, బెలూన్స్, ట్రైన్ ఆటలతో సరదాగా గడిపారు. వీటిని చూసిన ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఓటమి బాధలో తాముంటే మీరు ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసభ్య పదజాలంతో ఆటగాళ్లపై విరుచుకుపడుతున్నారు. వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతుంటే ఈ పిల్ల ఆటలేందిరా? అని ఒకరు కామెంట్ చేస్తే.. ముందు ఆ లచ్చిగాడిని(వీవీఎస్ లక్ష్మణ్)ను జట్టు నుంచి దొబ్బేయండని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇలా ఆడుకుంటే ఇంటికి వెళ్లడమే అని మరొకరు కామెంట్ చేశారు.
ఆ గార్గ్ గాడు ఏ పాపం చేశాడ్రా..
యువ ప్లేయర్ ప్రియమ్ గార్గ్‌కు ఓ అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. విజయ్ శంకర్ వల్ల జట్టుకు ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. అతన్ని జట్టు నుంచి తీసేసి ప్రియమ్ గార్గ్‌కు ఓ అవకాశం ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఆ గార్గ్ గాడు ఏ పాపం చేశాడ్రా? అని ఘాటుగా ట్వీట్ చేస్తున్నారు. ఇక భువనేశ్వర్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక కొందరైతే ఈ ఫొటోలు పెట్టే బదులు మమ్మల్ని చంపెయ్‌రా అని సన్‌రైజర్స్ ట్విటర్ హ్యాండిల్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయాలు అందుకున్న తర్వాత సెలెబ్రేషన్ చేసుకోండిరా? అంటూ చురలకలంటిస్తున్నారు.
మీరు అస్సాంకే..
ఇక ఈ పిల్ల చేష్టలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అస్సాంకే పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మ్యాచ్‌లు గెలవకుండా ఇలా ఆటలు ఆడుతుంటే ఫ్యాన్స్‌కు ఎలా ఉంటుందో? మీకు తెలుసారా? అని ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్ గెలవండ్రా సామీ అంటే.. మేం ఇండోర్ గేమ్స్ ఆడతామంటారేందిరా? ఒక్కొక్కడిని చెడుగుడు ఆడుతామని మండిపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అని లైట్ తీసుకుంటున్నారా? ఏందని మరొకరు ప్రశ్నించారు. అసలు శిఖర్ ధావన్ ఎవడ్రా మిమ్మల్ని వదులుకోమన్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమద్ గాయమంటూ ఈ పిల్ల ఆటలు ఎలా ఆడిస్తున్నారా? అని నిలదీస్తున్నారు.
సెలబ్రేషన్స్ కాదురా.. అయ్యా!
ఇక మరికొందరేమో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అండగా నిలుస్తున్నారు. అవి సెలెబ్రేషన్స్ కావని, టీమ్‌లో ఉత్సాహం నింపేందుకు చేసే యాక్టివిటీస్ అని ఎదురు దాడికి దిగుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు ఇలాంటి యాక్టివిటీస్ అవసరమని, వారు ఒత్తిడి నుంచి బయట పడి మెరుగైన ప్రదర్శన చేస్తారని వివరిస్తున్నారు. మనం పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు సినిమాలు, షికార్లకు వెళ్లినట్లు వాళ్లు కూడా సరదగా ఇండో గేమ్స్ ఆడుతున్నారని, మనం కంప్యూటర్స్‌తో పనిచేస్తే వారు బ్యాట్, బంతితో వర్క్ చేస్తున్నారని, క్రికెటర్స్ కూడా మనుషులేనని విమర్శకులపై ఓ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications