ఆడుతూ పాడుతూ..
భారత్ ఇచ్చిన 378 పరుగుల భారీ లక్ష్యచేధనలో నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్ 259/3తో నిలిచింది. నాలుగో వికెట్‌కు 150 పరుగులు జోడించిన జోరూట్(76 బ్యాటింగ్), బెయిర్ స్టో(72 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు ఆ జట్టుకు మరో 119 పరుగులు అవసరం. భారత్ నెగ్గాలంటే మరో 7 వికెట్లు పడగొట్టాలి. బౌలర్లు అద్భుతం చేస్తే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచేలా లేదు.
ఆ క్యాచ్ పట్టుంటే..?
ఇక 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో హనుమ విహారి వదిలేశాడు. అది పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. ఎందుకంటే భారీ లక్ష్యచేధనలో ఇంగ్లండ్ ఓపెనర్లు 107 పరుగుల భాగస్వామ్యం అందించగా.. బుమ్రా సూపర్ బౌలింగ్‌తో రెండు పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ పరిస్థితిల్లోనే క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో ఆరంభంలో తడబడ్డాడు. అతను ఇచ్చిన క్యాచ్ పట్టుంటే ఇంగ్లండ్ ఒత్తిడికి గురయ్యేది. రూట్ సైతం ఔటయ్యేవాడు. కానీ విహారి తప్పిదం భారత్ కొంపముంచింది. ఆ తర్వాత మహమ్మద్ షమీ బౌలింగ్‌లో బెయిర్ స్టో ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను పంత్ అందుకోలేకపోయాడు. ఈ రెండు అవకాశాలతో చెలరేగిన బెయిర్ స్టో భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు.
విలన్‌లా మారిన విహారి..
ఈ ఒక్య తప్పిదంతో తెలుగు కుర్రాడు విహారి విలన్‌లా మారాడు. అప్పటి వరకు భారత్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్క సారిగా చేజారడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కీలక మ్యాచ్‌ల్లో ఇలాంటి తప్పిదాలు చేయడం సరైంది కాదని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విహారి అన్ని విభాగాల్లో విఫలమయ్యాడని మండిపడుతున్నారు. బ్యాటింగ్‌లో చెత్త ప్రదర్శన కనబర్చిన విహారి.. ఫీల్డింగ్‌లో మరి లేజీగా కనిపించాడని కామెంట్ చేస్తున్నారు.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)
భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 57 ఓవర్లలో 259/3 (బెయిర్ స్టో 72 బ్యాటింగ్, జోరూట్ 76 బ్యాటింగ్)


Click it and Unblock the Notifications












