For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: మలుపు తిప్పిన నిర్ణయం.. రాజస్థాన్‌పై SRH ఘన విజయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదిరిపోయే విజయాన్నందుకుంది. సోమవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో 57 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించడంతో ఆరెంజ్ ఆర్మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడంతో పాటు నెట్ రన్‌రేట్ కూడా మెరుగైంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది రెండో విజయం. అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్ నాలుగేసి వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

కెప్టెన్సీ నాకు కొత్త కాదు: ఇషాన్ కిషన్కెప్టెన్సీ నాకు కొత్త కాదు: ఇషాన్ కిషన్

ఇషాన్ కిషన్ సెంచరీ మిస్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 91) తృటిలో శతకం చేజార్చుకోగా.. హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో 4 సిక్స్‌లతో 28), సలీల్ అరోరా(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/37) రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డోనవన్ ఫెరీరా(44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69), రవీంద్ర జడేజా(32 బంతుల్లో 5 ఫోర్లతో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే(4/34), సకీబ్ హుస్సేన్(4/24) నాలుగేసి వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగా(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు.

Turning Point Praful Hinge Historic Triple-Wicket Opening Over Swings Momentum for SRH s 57-Run Win Over RR

మలుపు తిప్పిన ప్రఫుల్ హింగే..

217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ అరంగేట్ర పేసర్ ప్రఫుల్ హింగే కోలుకోలేని దెబ్బతీసాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ రెండో బంతికే డేంజరస్ వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన ప్రఫుల్ హింగే.. నాలుగో బంతికి ధ్రువ్ జురెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖరి బంతికి ప్రిటోరియస్‌ను క్యాచ్ ఔట్ చేసి అరంగేట్ర ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ప్రఫుల్ హింగే ధాటికి రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగుకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ ఒక్క ఓవరే రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది. ఆ తర్వాత మరో అరంగేట్ర పేసర్ సకీబ్ హుస్సేన్(4/24) నాలుగు వికెట్లతో చెలరేగి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని లాంఛనం చేశాడు. ఈ ఇద్దరూ అరంగేట్ర పేసర్ల అద్భుత ప్రదర్శనతో బలహీనంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ యూనిట్‌ భీకరంగా మారింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 219 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయిన సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో మాత్రం అదిరిపోయే ప్రదర్శన కనబర్చింది.

Praful Hinge: ఒకే ఓవర్‌లో 3 వికెట్లు.. ఎవడ్రా ఈ SRH డైనమైట్!Praful Hinge: ఒకే ఓవర్‌లో 3 వికెట్లు.. ఎవడ్రా ఈ SRH డైనమైట్!

Story first published: Monday, April 13, 2026, 23:36 [IST]
Other articles published on Apr 13, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+