ఆ తెలుగు హీరోయిన్ కోసం పోటీపడుతున్న ఐపీఎల్ స్టార్స్! (వీడియో)
పంజాబ్ కింగ్స్ కో ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా హగ్ కోసం ఆ జట్టు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఈ సొట్ట బుగ్గుల సుందరి ప్రత్యేకంగా అభినందిస్తోంది. ఆటగాళ్లను హగ్ చేసుకొని మరి వారి మంచి చెడులు తెలుసుకుంటుంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో విజయానంతరం పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్రీతి జింటా హత్తుకుంది.
దాంతో అర్ష్‌దీప్ సింగ్ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. టైటిల్ గెలిచినంత ఆనందంలో ఎగిరి గంతేసిన అర్ష్‌దీప్ సింగ్.. మొత్తానికి సాధించానని చేతులు పైకెత్తి సైగలు చేశాడు. ప్రీతి జింటాను హగ్ చేసుకోవడం తన కల అని, అది నెరవేరిందని ఈ స్టార్ పేసర్ పరోక్షంగా వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.
ప్రీతి జింటా హగ్ కోసం పంజాబ్ ఆటగాళ్లంతా పోటీ పడుతున్నారని సెటైర్లు పేల్చుతున్నారు. ప్రీతి జింటా కోసమే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ప్రీతి జింటా ఆటగాళ్లను హత్తుకోవడం, ఆత్మీయ సంభాషణలు జరపడం ఇదే తొలిసారి కాదు. గత 19 సీజన్లుగా ఆమె తన ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూనే ఉంది. ఆటగాళ్లనే కాదు అభిమానులను కూడా ప్రీతి జింటా ప్రత్యేకంగా చూసుకుంటుంది.

తమ జట్టు విజయానంతరం అభిమానులకు జెర్సీలు, బహుమతులను గ్యాలరీలోకి విసిరేస్తూ వారిని సంతోషపరుస్తోంది. జట్టు యజమానిగా కాకుండా.. పంజాబ్ కింగ్స్ కుటుంబ సభ్యురాలిగా వ్యవహరిస్తూ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ అభిమానుల మనసులను గెలుచుకుంటుంది.
కెరీర్ ఆరంభంలో ప్రీతి జింటా తెలుగు సినిమాల్లో నటించింది. విక్టరీ వెంకటేష్ ఆల్‌టైమ్ హిట్ 'ప్రేమంటే ఇదేరా' సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరిచయమైన 'రాజకుమారుడు' మూవీలో నటించింది. ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. బాలీవుడ్‌లో బిజీ కావడంతో మళ్లీ తెలుగు సినిమాల వైపు ప్రీతి జింటా చూడలేదు. ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటున్న ఆమె కుటుంబ వ్యాపారాలు చూసుకుంటుంది. ఐపీఎల్ సమయంలో పంజాబ్ కింగ్స్‌కు మద్దతుగా ప్రతీ మ్యాచ్ హాజరవుతూ.. ఆటగాళ్లతో పాటు అభిమానులను ఉత్సాహపరుస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలి 6 మ్యాచ్‌ల్లో ఐదు గెలవడంతో పాటు మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఓటమెరుగని జట్టుగా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే తొలి 6 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డ్ సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications