Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్మృతి మంధాన‌కు సిక్స్ ప్యాక్..?

మహిళల టీ20 ప్రపంచకప్ 2025 టోర్నీలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. ఆస్ట్రేలియాతో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మంధాన(66 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఈ ఇన్నింగ్స్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది.

ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 వన్డే పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న బ్యాటర్‌గానూ నిలిచింది. వన్డేల్లో ఆస్ట్రేలియాపై ఐదు 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి బ్యాటర్‌గానూ రికార్డ్ సాధించింది. స్మృతి మంధాన రాణించినా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి తప్పలేదు. పేలవ బౌలింగ్‌తో 331 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలే 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

Truth Behind Smriti Mandhana s Viral Six-Pack Abs Picture Revealed
Photo Credit: X (twitter)

స్మృతి మంధాన‌ సిక్స్ ప్యాక్..?

తాజాగా స్మృతి మంధానకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. స్మృతి మంధాన సిక్స్ ప్యాక్ ఫొటో అంటూ కొందరు నెటిజన్లు ఈ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో అలిసిపోయిన స్మృతి మంధాన తన టీషర్ట్ పైకెత్తి ముఖం తుడుచుకుంటున్నట్లుగా ఉన్న ఈ ఫొటో నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఫొటోలో స్మృతి మంధాన ఆబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంధాన సిక్స్ ప్యాక్ అంటూ నెటిజన్లు ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

ఏఐ జనరేటెడ్ ఫొటో

అయితే ఇది ఫేక్ ఫొటో అని స్పష్టంగా తెలుస్తోంది. ఏఐ జనరేటెడ్ లేదా ఎడిటింగ్ ఫొటో అని స్పష్టంగా అర్థమవుతుంది. ఏ మహిళా క్రికెటర్ కూడా తమ టీషర్ట్ పైకెత్తి ఆబ్స్ చూపించుకోరు. అంతేకాకుండా ఇది ఫేక్ ఫొటో అని ఎక్స్‌ ఏఐ ఫ్లాట్‌‌ఫామ్ గ్రోక్ స్పష్టం చేసింది. స్మృతి మంధాన సిక్స్ ప్యాక్ సంబంధించిన ఫొటోను ఆమె ఎక్కడా పంచుకోలేదని పేర్కొంది. కొందరు ఆకతాయిలు కావాలనే ఈ పిక్ క్రియేట్ చేశారనే విషయం అర్థమవుతుంది.

మహిళల క్రికెట్‌లో స్మృతి మంధాన ఫిట్టెస్ట్ క్రికెటర్ అనడంలో సందేహం లేదు. ఆమెకు సిక్స్ ప్యాక్ కూడా ఉండొచ్చు. కానీ అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఎప్పుడూ ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకోలేదు. బ్యూటీ క్రికెటర్‌గా స్మృతి మంధానకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ విషయాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఆకతాయిలు ఈ పని చేశారు.

Story first published: Monday, October 13, 2025, 13:51 [IST]
Other articles published on Oct 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+