Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే విఫలమైనా నికోలస్ పూరన్‌ను ఆడిస్తున్నాం: రిషభ్ పంత్

పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నా.. నికోలస్ పూరన్‌ను ఆడించడానికి అతని అనుభవమే ప్రధాన కారణమని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో తుది జట్టులో మార్పులు చేసినా నికోలస్ పూరన్‌‌ను పక్కన పెట్టలేమని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది.

పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రిషభ్ పంత్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. గతం గురించి పట్టించుకోకుండా ప్రస్తుత మ్యాచ్‌పైనే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాం. ముందుగా బౌలింగ్ చేసి రాజస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని అనుకుంటున్నాం.

వరుసగా విఫలమైనా..

లక్నోలో పిచ్ కండిషన్స్ సవాల్‌గా ఉన్నాయి. ఈ ఛాలెంజ్‌ను మేం ఇష్టపడుతున్నాం. మా సొంతగడ్డపై ఎలా ఆడాలో మేం ఒక మార్గాన్ని కనుగొంటాం. వరుస వైఫల్యాల నేపథ్యంలో తుది జట్టులో స్వల్ప మార్పులు చేశాం. జట్టు స్థిరత్వం దెబ్బతినకుండా ఈ మార్పులు చేశాం. మా బౌలింగ్ విభాగంలో రెండు మార్పులు జరిగాయి.. సిద్ధార్థ్ స్థానంలో దిగ్వేష్ రతి, ఆవేష్ స్థానంలో మయాంక్ యాదవ్ జట్టులోకి వచ్చారు.

నికోలస్ పూరన్‌ను తుది జట్టు నుంచి తప్పించలేం. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఆటగాడిని ఎలా ఆడినా నమ్మాలి. మా జట్టుకు అతను చాలా ముఖ్యం. నికోలస్ పూరన్ పట్ల మాకున్న ప్రేమ, కేర్ అలాంటిది.'అని రిషభ్ పంత్ తెలిపాడు.

Trust Over Form Rishabh Pant Backs Nicholas Pooran s X-Factor Despite Slump in IPL 2026
Photo Credit: screen grab for JioHotstar

టాస్ ఓడిపోవాలనుకున్నా..

మరోవైపు టాస్ ఓడిపోవాలని కోరుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. ఈ పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అయోమయంలో ఉన్నానని చెప్పాడు. టాస్ ఓడిపోయినందుకు సంతోషంగా ఉందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ ఎదైనా చేయడానికి తాను సిద్దమేనని తెలిపాడు. 'ఇక్కడ కొన్ని దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాం. రెండో ఇన్నింగ్స్ సమయంలో పిచ్ కొంచెం నెమ్మదించవచ్చు.

గత మ్యాచ్‌లో కోల్‌కతాపై మేము బాగానే బ్యాటింగ్ చేశాం. కానీ మిడిల్ ఓవర్లలో కొన్ని లెక్కలు తప్పాయి. అయితే జైస్వాల్, వైభవ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఆ మ్యాచ్ కొన్ని తప్పులు జరిగాయి. మనం గెలవాలంటే 40 ఓవర్ల పాటు అత్యుత్తమ క్రికెట్ ఆడాలని మా ఆటగాళ్లకు చెప్పాను. ఈ రాత్రి అది చేస్తామని ఆశిస్తున్నాను. మేం అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం'అని రియాన్ పరాగ్ తెలిపాడు.

తుది జట్లు:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డొనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాండ్రే బర్గర్.

లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్.

Story first published: Wednesday, April 22, 2026, 20:15 [IST]
Other articles published on Apr 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+