Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Karun Nair: డియర్ క్రికెట్ ఒక్క చాన్స్.. త్రిశతక వీరుడి భావోద్వేగం.. ఇషాన్‌ కిషన్‌కు వార్నింగ్!

 Triple Centurion Karun Nair Posts Emotional Tweet After Ranji Trophy Snub

బెంగళూరు: టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత అందుకున్న త్రిశతక వీరుడు. 2016లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కర్ణాటకు చెందిన కరుణ్ నాయర్ ఈ ఘనతను అందుకున్నాడు. దాంతో అతని పేరు అప్పట్లో దేశవ్యాప్తంగా మారమోగిపోయింది. భారత జట్టులోకి మరో సెహ్వాగ్ వచ్చాడని, టీమిండియా భవిష్యత్ తారా.. అని, స్టార్ ఆటగాడిగా ఎదుగుతాడని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

 రంజీ టీమ్‌లో కూడా లేడు..

రంజీ టీమ్‌లో కూడా లేడు..

కానీ ఇప్పుడు కరుణ్ నాయర్ రంజీ టీమ్‌లో కూడా చోటు కోల్పోయాడు. స్టార్ ప్లేయర్ అవ్వడం దేవుడెరుగు.. దేశవాళీ క్రికెట్‌లో కూడా కొనసాగలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే కరుణ్ నాయర్ చేసిన భావోద్వేగ పూరిత ట్వీట్ క్రికెట్ అభిమానుల కదలించింది. 'డియర్ క్రికెట్.. నాకు మరొక చాన్స్ ఇవ్వు'అంటూ చేసిన చేసిన ట్వీట్ అతని పరిస్థితి అద్దం పడుతుంది. క్రికెట్‌ను మతంలా ఆరాధించే భారత్‌లో క్రికెటర్‌గా కొనసాగించడం ఆశమాషి వ్యవహారం కాదనే విషయాన్ని తెలియజేస్తోంది. ఒక్క ట్రిపుల్ సెంచరీతో స్టార్ ప్లేయర్ అయిపోదామంటే కుదుదరని, నిలకడగా రాణిస్తేనే ఆ హోదా దక్కుతుందనే విషయం బోధపడుతోంది.

 నా జీవితాంతం వెంటాడే..

నా జీవితాంతం వెంటాడే..

అయితే కరుణ్ నాయర్ వైఫల్యం వెనుక టీమిండియా సెలెక్టర్లు తీరు కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ అంటే ఆశమాషి వ్యవహారం కాదు. కానీ టీమిండియా సెలెక్టర్లు కరుణ్ నాయర్‌కు సరైన అవకాశాలు ఇవ్వలేదు. అప్పడు చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్ సైతం ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అంగీకరించాడు. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా తన పదవి కాలంలో కరుణ్ నాయర్‌కు న్యాయం చేయలేకపోవడం తనను అత్యంతగా బాధపెట్టే అంశమని చెప్పుకొచ్చాడు. ట్రిపుల్ సెంచరీ తర్వాత కరుణ్ నాయర్‌కు మూడంటే మూడే టెస్ట్‌ మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చి పక్కనపెట్టేసారు. 2017లో ఆస్ట్రేలియాతో విఫలమవడంతో వేటు వేసారు.

దేశవాళీలో కూడా చోటు లేకపోవడంతో..

దేశవాళీలో కూడా చోటు లేకపోవడంతో..

అయితే తనను ఎందుకు తప్పించారనే విషయంపై టీమ్‌మేనేజ్‌మెంట్ వివరణ ఇవ్వలేదని కరుణ్ నాయర్ గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం రాకపోయినా.. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు కొనసాగాడు. కానీ కొంత కాలం తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోపీ వంటి రాష్ట్ర స్థాయి జట్టుల్లో కూడా కరుణ్ నాయర్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే కరుణ్ నాయర్ ట్విటర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ అభిమానులను కదిలించింది. 'సోదరా.. నీ త్రిశతకాన్ని మేమింకా మర్చిపోలేదు. నువ్వు కచ్చితంగా మళ్లీ నిరూపించుకుంటావు'అని కామెంట్ చేస్తున్నారు.

ఇషాన్ కిషన్‌కు హెచ్చరిక..

అయితే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాదిన నేపథ్యంలో కరుణ్ నాయర్ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇషాన్ కిషన్‌ను పరోక్షంగా హెచ్చరించేందుకే కరుణ్ నాయర్ ఈ ట్వీట్ చేశాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తనలా కెరీర్ పాడు చేసుకోవద్దని, ప్రణాళికలతో ముందుకు సాగాలని పరోక్షంగా సూచించాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో అవకాశం అందుకున్న ఇషాన్ 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాది అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

Story first published: Sunday, December 11, 2022, 12:32 [IST]
Other articles published on Dec 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+