IND vs ENG: ఫస్ట్ టెస్ట్‌కు గ్రీన్ పిచ్.. కోహ్లీసేన నిలబడుతుందా? మరో 36కు చేతులెత్తేస్తుందా?

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ ఓటమితో డీలా పడిన టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై కీలక పోరుకు సిద్దమైంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మరో గంటలో ప్రారంభమయ్యే ఫస్ట్ మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. పరిస్థితు అంచనా వేయకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండు రోజుల ముందే ఫైనల్ ఎలెవన్ ప్రకటించి బొక్కబోర్ల పడిన కెప్టెన్.. కోహ్లీ ఈ మ్యాచ్ కోసం పకడ్బంది ప్లాన్స్ వేస్తున్నాడు. కానీ ఇంగ్లండ్ మాత్రం రీవెంజ్ తీసుకునేందుకు సిద్దమైంది. భారత్ వేదికగా స్పిన్ పిచ్‌లతో తమను బోల్తా కొట్టించినందుకు ప్రతీకారంగా పేస్ పిచ్‌లను సిద్దం చేస్తోంది.

పక్కా పేస్ పిచ్‌లే..
ఈ విషయాన్ని ఇంగ్లండ్ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ చెప్పకనే చెప్పాడు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ పిచ్‌లను తమకు అనుకూలంగా తయారుచేసినా 'కోహ్లీసేన' అభ్యంతరం వ్యక్తం చేయదన్నాడు. గత ఫిబ్రవరి, మార్చిలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లు తయారుచేశారని, దాంతో తాము ఆతిథ్య జట్టు ఉచ్చులో పడిపోయామని అండర్సన్ చెప్పుకొచ్చాడు. అదే వరుసలో ఇప్పుడు తాము కూడా హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రపంచంలో ప్రతి జట్టూ తమకు అనుకూలంగా ఉండే పిచ్‌లు తయారు చేయించుకుంటుందని, అది తప్పు కాదని అండర్సన్ అన్నాడు. ఈ క్రమంలోనే రాబోయే టెస్టు సిరీస్‌లో పిచ్‌లపై పచ్చిక ఉన్నా భారత జట్టూ తమ పేస్‌దళంతో బరిలోకి దిగాలని సూచించాడు.

మూడు రోజుల్లో ఖేల్ ఖతమ్..
ఇక బీసీసీఐ సైతం మూడు రోజుల క్రితం ఫస్ట్ టెస్ట్‌కు సంబంధించిన పిచ్ ఫొటోను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. పూర్తిగా పచ్చికతో కూడిన వికెట్‌ను ఉద్దేశించి ఫస్ట్ టెస్ట్ మూడు రోజుల్లో ముగిసిపోయేట్టుంది కదా? అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. అయితే అభిమానులు ఈ గ్రీన్ వికెట్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేగా అంతేగా అంటూ బీసీసీ క్యాప్షన్‌తో కొందరు ఏకీభవిస్తుంటే.. మరికొందరు మాత్రం కోహ్లీసేన మరోసారి 36 పరుగులకు చేతులెత్తేయదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేస్ దెబ్బకు భారత్ 36 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. జట్టులో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ ఉన్నా.. కదిలే బంతులు ఆడటంలో భారత ఆటగాళ్లు తడబడుతారు.

గ్రీన్ వికెట్‌పై యూటర్న్..
అయితే గ్రీన్ వికెట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో ఇంగ్లండ్ వేల్స్ బోర్డు ఆఖరి నిమిషంలో తమ నిర్ణయానికి మార్చుకున్నట్లు తెలుస్తోంది. నేటి(బుధవారం) ఉదయం పిచ్‌పై ఉన్న గ్రాస్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. పిచ్ తాజా ఫొటోలు చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వికెట్ ఆరంభంలో సీమ్ బౌలింగ్‌కు అనుకూలిస్తూ ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగే సాధారణ ఇంగ్లండ్ తరహా పిచ్‌లా ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. కొంత పచ్చిక ఉన్నా, టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవచ్చంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications