IND vs NZ T20 WC: షాహిన్ అఫ్రిదీలా చెలరేగుతా.. టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు ట్రెంట్ బౌల్ట్ వార్నింగ్!

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లోని కీలక పోరు ముందు టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మన్‌కు న్యూజిలాండ్ స్వింగ్ కింగ్ ట్రెండ్ బౌల్ట్ వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్ లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ అఫ్రిదిలానే చెలరేగుతానని, మరోసారి కోహ్లీసేనను అప్‌సెట్ చేస్తామని చెప్పాడు. ఇక పాకిస్థాన్ చేతిలో ఓడిన రెండు జట్లు ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నీలో ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తప్పనిసరిగా గెలవాల్సిందే. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంది. అయితే ఈ సూపర్ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన ట్రెంట్ బౌల్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అఫ్రిదీలా చెలరేగుతాం..
'భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నేను చూశాను. షాహిన్ అఫ్రిదీ ఎలా టీమిండియా టాపార్డర్‌ను కూల్చాడో నేను అలానే చేస్తాను. మరోసారి భారత్‌ను అప్‌సెట్ చేస్తాం. టీమిండియా టాపార్డర్‌ను కూల్చితే ఆ జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. వేగంగా పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే అఫ్రిది ఏం చేశాడో, నేను దాన్నే ఫాలో అవుతా. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో, డబ్యూటీసీ ఫైనల్లో ఇలానే చేసి భారత్‌ను ఓడించాం. మరోసారి అదే ప్రదర్శనతో దెబ్బతీస్తాం.

ఓడినా ఆఖరి వరకు పోరాడాం..
ఇక పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మేం ఓడినా ఆఖరి వరకు పోరాడాం. ఆ క్రమంలోనే భారత్‌తో మ్యాచ్‌కు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. గాయపడ్డ మార్టిన్ గప్టిల్ కోలుకుంటున్నాడు. టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడుతాడు. దుబాయ్ వాతావరణం, పిచ్ చేజింగ్ టీమ్‌కు అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి టాస్ గెలవడం కీలకం. టీమిండియాలో వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఒకవేళ టాస్ ఓడిపోయినా టీమిండియాను ఆదిలోనే దెబ్బతీస్తే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం దొరుకుతుంది.'అని ట్రెంట్ బౌల్ట్ చెప్పుకొచ్చాడు.

బౌల్ట్‌ను కౌంటర్ చేస్తాం..
ట్రెంట్ బౌల్ట్ వ్యాఖ్యలను విరాట్ కోహ్లీ ముందు ప్రస్తావించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. 'ట్రెంట్ బౌల్ట్.. షాహిన్ అఫ్రిదిని చూసి మోటీవేట్ అయితే మంచిదే. అయితే మేం అతన్ని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నాం. బౌల్ట్‌పై ఎదురుదాడికి దిగి ఒత్తిడిలో పడేయడమే మా ప్రణాళిక. అతనే కాదు మిగతా బౌలర్లను కూడా అలానే ఆడుతాం. అయితే ఇది మైదానంలోని మా మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇక పాకిస్థాన్‌తో గత రెండేళ్లుగా మేం మ్యాచ్ ఆడింది లేదు. కానీ న్యూజిలాండ్‌తో తరుచుగా ఆడాం. వారి బౌలింగ్ అటాక్స్ గురించి మాకు పూర్తి అవగాహన ఉంది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

18 ఏళ్లుగా గెలిచిందే లేదు..
ఇక ఐసీసీ టోర్నీల్లో గత 18 ఏళ్లుగా న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ రికార్డే భారత అభిమానులను కలవరపెడుతోంది. 2003 వన్డే ప్రపంచకప్ విజయానంతరం భారత్ ఆడిన అన్నీ ఐసీసీ టోర్నీల్లో ప్రతికూల ఫలితమే వచ్చింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమి తీరని వేదనను మిగల్చగా.. ఈ ఏడాది జూన్‌లో జరిగిన వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ అదే ఫలితం ఎదురైంది.
పరిస్థితులన్నీ భారత్‌కు ప్రతీకూలంగా మారాయి. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరిస్థితుల్లోనే రేపటి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలుస్తుందా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications