Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: రిషభ్ పంత్, అశ్విన్ ఔట్.. ఓటమి దిశగా భారత్!

Trent Boult strikes twice in an over

సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ ఓటమి ముంగిట నిలిచింది. ఓకే ఓవర్‌లో రిషభ్ పంత్(41), రవిచంద్రన్ అశ్విన్(7) ఔటవ్వడంతో 156 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో టెయిలండర్స్ ఇషాంత్ శర్మ(0), మహమ్మద్ షమీ(0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ కేవలం 124 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. ఇంకా 55 ఓవర్లకు పైగా ఆట మిగిలి ఉంది. క్రీజులో కుదురుకున్న రిషభ్ పంత్‌, అశ్విన్‌ ట్రెంట్ బౌలింగ్‌లో వరుసగా ఔటవ్వడంతో మ్యాచ్‌పై న్యూజిలాండ్ పట్టుబిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ను గట్టెక్కించాలంటే టెయిలెండర్లే ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.

అంతకుముందు అంతకుముందు 64/2 ఓవర్‌‌‌నైట్ స్కోర్‌తో రిజర్వ్ డే సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో బౌలింగ్ చేసిన జెమీసన్ మరోసారి భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. వరుస ఓవర్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(13), చతేశ్వర్ పుజారా(15)ను పెవిలియన్‌కు చేర్చాడు. జెమీసన్ ధాటికి ఓవర్‌నైట్ స్కోర్‌‌కు కోహ్లీ 5 పరుగులే జత చేయగా.. పుజారా ఒక పరుగు మాత్రమే చేసి పేవిలియన్ చేరారు. ఆ వెంటనే పంత్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. జెమీసన్ బౌలింగ్‌లో అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో సౌథీ వదిలేశాడు.

ఈ పరిస్థితులో వైస్ కెప్టెన్ రహానే(15) బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 37 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బౌల్ట్ వీడదీసాడు. లెగ్ స్టంప్‌కు వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో రహానే కీపర్ క్యాచ్ వెనుదిరిగాడు. దాంతో భారత్ 130/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత జడేజా(16)ను నీల్ వాగ్నర్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్‌తో పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ట్రెంట్ బౌల్ట్.. ఈ ఇద్దరిని ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు.

Story first published: Wednesday, June 23, 2021, 19:08 [IST]
Other articles published on Jun 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+