Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs SA: దుమ్మురేపిన కాటేరమ్మ కొడుకు!

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ట్రావిస్ హెడ్ దుమ్మురేపాడు. అనూహ్యంగా బంతితో మెరిసిన ట్రావిస్ హెడ్ నాలుగు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించాడు. ఫీల్డింగ్‌లోనూ కళ్లు చెదిరే రనౌట్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్నాడు.

పార్ట్‌టైమ్ బౌలర్ అయిన ట్రావిస్ హెడ్.. బంతితో మాయ చేశాడు. విధ్వంసకర బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్(0) సిల్వర్ డక్‌గా పెవిలియన్ చేర్చిన ట్రావిస్ హెడ్.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా తరలించిన డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్‌(6)‌ను రెండో బంతికే ఔట్ చేశాడు. కేశవ్ మహారాజ్(13)ను క్యాచ్ ఔట్ చేసిన ట్రావిస్ హెడ్..ప్రేనేలన్ సుబ్రాయెన్(1)ను రనౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన ట్రావిస్ హెడ్ 57 పరుగులిచ్చి 4 వికెట్లు తీసాడు. అతని ధాటికి ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులే చేసింది.

Travis Head s Four-Wicket Haul Helps Australia Restrict South Africa in 1st ODI

ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(81 బంతుల్లో 9 ఫోర్లతో 82) తృటిలో శతకం చేజార్చుకోగా.. టెంబా బవుమా(74 బంతుల్లో 5 ఫోర్లతో 65), మాథ్యూ బ్రిట్జ్‌కే(56 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ట్రావిస్ హెడ్‌కు తోడుగా.. బెన్ ద్వార్షుయిస్ రెండు, ఆడమ్ జంపా ఓ వికెట్ తీసాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు చేస్తుంది. 5 ఓవర్లలోనే ఆసీస్ 50 పరుగులు పూర్తి చేసుకుంది.

Story first published: Tuesday, August 19, 2025, 14:48 [IST]
Other articles published on Aug 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+