Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes: ట్రావిస్ హెడ్ ఊచకోత.. ఇంగ్లండ్‌పై ఆసీస్ ఘన విజయం!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్యఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్.. ట్రావిస్ హెడ్(83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123) విధ్వంసకర శతకంతో 28.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని కైవసం చేసుకుంది.

టెస్ట్‌ల్లో టీ20 బ్యాటింగ్..

రెండు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై టీ20 తరహా బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన ట్రావిస్ హెడ్.. 69 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో హోరాహోరీ తప్పదనుకున్న మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అతనికి తోడుగా మార్నస్ లబుషేన్(49 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు తేలిపోయారు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ నవంబర్ 29 నుంచి కాన్‌బెర్రా వేదికగా ప్రారంభం కానుంది.

Travis Head Smashes 2nd Fastest Ashes Century as Australia Defeat England in the 1st Test

నిప్పులు చెరిగిన స్టార్క్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్(61 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓలీ పోప్(58 బంతుల్లో 4 ఫోర్లతో 46), జెమీ స్మిత్(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(7/58) ఏడు వికెట్లతో నిప్పులు చెరిగాడు. బ్రెండన్ డొగ్గెట్(2/27) రెండు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ క్యారీ(26), కామెరూన్ గ్రీన్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ట్రావిస్ హెడ్(21) విఫలమయ్యాడు. బెన్ స్టోక్స్(5/23) ఐదు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ (3/45) మూడు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్(2/11)‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఇక 40 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. గస్ అట్కిన్సన్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), ఓలీ పోప్(57 బంతుల్లో 2 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/55)తో పాటు స్కాట్ బోలాండ్(4/33) నాలుగు వికెట్లు పడగొట్టాడు.

బ్రెండన్ డొగ్గెట్(3/51) మూడు వికెట్లు తీసాడు. దాంతో ఆసీస్ ముందు 205 పరుగుల లక్ష్యం నమోదైంది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్‌పై ఈ లక్ష్యాన్ని ఛేదించడం ఆసీస్‌కు కష్టమవుతుందని అంతా అనుకున్నారు. కానీ ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగి టీ20 బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు.

Story first published: Saturday, November 22, 2025, 15:39 [IST]
Other articles published on Nov 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+