Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సునీల్ గవాస్కర్ ఓ జోకర్.. ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సునీల్ గవాస్కర్ ఓ జోకర్‌లా మాట్లాడుతున్నాడని విమర్శించాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. రెండో టెస్ట్‌కు సిద్దమైంది.

శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్‌లో భారత్, ఆసీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను ఉద్దేశించి గవాస్కర్.. ఓ పత్రికకు రాసిన కాలమ్ వివాదాస్పదమైంది. రెండో టెస్ట్‌కు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్ దూరమవుతున్నాడని గవాస్కర్ పేర్కొన్నాడు.

Travis Head slams Sunil Gavaskar for inciting division in Australian Team

తొలి టెస్ట్ పరాజయంతో ఆసీస్ జట్టులో భయం అలుముకుందని ఈ కాలమ్‌లో ప్రస్తావించాడు. 'తొలి టెస్ట్ ఓటమితో ఆసీస్ జట్టు భయం అలుముకుంది. అందుకే ఆ జట్టు మేనేజ్‌మెంట్ కొందరి సీనియర్లపై వేటు వేసింది. తొలి టెస్ట్‌ మూడో రోజు హజెల్ వుడ్ మాట్లాడిన మాటలతోనే అతన్ని జట్టులో నుంచి తప్పించనున్నారు.

బౌలర్లు ఏం చేయలేరని, బ్యాటర్లే ఆసీస్‌ను రక్షించాలని అతను అన్నాడు. ఆ వ్యాఖ్యలతో ఆ జట్టులోని సమస్యలు స్పష్టంగా కనిపించాయి. ఈ క్రమంలోనే అతను రెండో టెస్ట్‌ తుది జట్టులో చోటు కోల్పోయాడు. వాస్తవానికి హజెల్ వుడ్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. గతంలో టీమిండియా కూడా ఇలానే ఉండేది. ఇప్పుడు ఆసీస్‌లో అలా జరుగుతోంది.'అని పేర్కొన్నాడు.

అయితే సన్నీ వ్యాఖ్యలపై ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందించాడు. సునీల్ గవాస్కర్ కామెంట్స్ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నాడు. సునీల్ గవాస్కర్ ఓ జోకర్‌లానే మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించాడు. అతని వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

'సునీల్ గవాస్కర్ ఇప్పుడు వినోద పరిశ్రమలో ఉన్నారని కొన్ని జట్లు అంటున్నాయి. ప్రస్తుతం ఆయన కామెంట్రీ ప్యానెల్‌లో సభ్యుడు. అలాంటి వ్యాఖ్యలను ఆయనకు వినోదాన్నిస్తే.. అదే కొనసాగించమనండి'అని పేర్కొన్నాడు. సునీల్ గవాస్కర్ కామెంట్స్‌పై ఆసీస్ మాజీ ఆటగాళ్లు కూడా విమర్శలు గుప్పించారు.

Story first published: Thursday, December 5, 2024, 17:33 [IST]
Other articles published on Dec 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+