Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, సచిన్ కాదు.. అతనే నా ఫేవరేట్ ఇండియన్ ప్లేయర్: ట్రావిస్ హెడ్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫేవరేట్ ఇండియన్ క్రికెటర్ అని, సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ తెలిపాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అతని కెప్టెన్సీ కూడా అద్భుతమని కొనియాడాడు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రావిస్ హెడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నిర్వహించగా.. ట్రావిస్ హెడ్ తనదైన శైలిలో బదులిచ్చాడు.

రోహిత్ శర్మ తన ఫేవరేట్ ఇండియన్ బ్యాటర్ అని చెప్పిన ట్రావిస్ హెడ్.. ఆస్ట్రేలియా జట్టులో ఉండాలని తాను కోరుకునే భారత ఆటగాడు కూడా అతనేనని తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కాకుండా ఇతర ఫ్రాంచైజీకి ఆడాలంటే ముంబై ఇండియన్స్‌ను ఎంచుకుంటానని చెప్పాడు. మూడు ప్రశ్నలకు సమాధానం రోహిత్ శర్మకు సంబంధించినవే చెప్పడంతో రోహిత్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మకు ట్రావిస్ హెడ్ డై హార్డ్ ఫ్యాన్ ఉన్నట్టున్నాడుగా అని కామెంట్ చేస్తున్నారు.

Travis Head Says My Favourite Indian batter Rohit Sharma ahead Of SRH vs PBKS IPL 2025 Clash

ఐపీఎల్ 2025 సీజన్‌లో ట్రావిస్ హెడ్ వైఫల్యం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ట్రావిస్ హెడ్ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 67, 47, 22, 4, 8 పరుగులే చేశాడు. అతని వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. తొలి మ్యాచ్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లోనైనా ట్రావిస్ హెడ్ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ట్రావిస్ హెడ్‌పై ఫ్యాన్స్ ఫైర్
ట్రావిస్ హెడ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ అభిమాని సెల్ఫీ రిక్వెస్ట్‌ను అతను నిరాకరించడం నెట్టింట చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సూపర్ మార్కెట్‌కు వచ్చిన ట్రావిస్ హెడ్‌ను కొందరు అభిమానులు సెల్ఫీ కావాలని కోరారు. అందుకు ట్రావిస్ హెడ్ నిరాకరించాడు. తాము సన్‌రైజర్స్ అభిమానులమని చెప్పినా వినిపించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఇంత బలుపు ఏంటని ఫ్యాన్స్ మండిపడ్డారు.

Story first published: Friday, April 11, 2025, 14:13 [IST]
Other articles published on Apr 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+