SRH ఆటగాడికి ప్రతిష్టాత్మక అవార్డ్.. ఒక్క ఓటుతో గట్టెక్కిన కాటేరమ్మ కొడుకు!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది. ఆస్ట్రేలియా అత్యున్నత పరుస్కారమైన అలన్ బోర్డర్ మెడల్‌ను వరుసగా రెండో ఏడాది కూడా ట్రావిస్ హెడ్ కైవసం చేసుకున్నాడు.
బ్రిస్బేన్ వేదికగా జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డుల కార్యక్రమంలో దిగ్గజ కెప్టెన్ అలన్ బోర్డర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అందుకున్నాడు. దాంతో వరుసగా రెండో ఏడాది అలెన్ బోర్డర్ మెడల్ అందుకున్న ఐదో ఆసీస్ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు అయిన రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ సరసన చేరాడు.

ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం జరిగిన ఓటింగ్‌లో ట్రావిస్ హెడ్ కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందడం గమనార్హం. తన సహచర ఆటగాడు, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ 152 ఓట్లతో రెండో స్థానంలో నిలిచి తృటిలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును కోల్పోయాడు. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 150 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 2025 జనవరి 29 నుంచి 2026 జనవరి 8 వరకు ఉన్న ఓటింగ్ వ్యవధిలో ట్రావిస్ హెడ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
గతేడాది ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్లలో 30 మ్యాచ్‌లు ఆడిన ట్రావిస్ హెడ్.. 1,437 పరుగులు సాధించి ఆసీస్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ముఖ్యంగా యాషెస్ సిరీస్‌లో మూడు సెంచరీలతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే కార్యక్రమంలో షేన్ వాట్సన్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా మిచెల్ స్టార్క్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా మిచెల్ మార్ష్, టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా టిమ్ డేవిడ్ అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ట్రావిస్ హెడ్.. అలన్ బోర్డర్ సమక్షంలో వరుసగా రెండోసారి ఈ మెడల్ అందుకోవడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. అప్‌కమింగ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, వన్డే ప్రపంచకప్‌లపైనే తన పూర్తి దృష్టి ఉందని స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

