For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్

ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 10 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో 50 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ట్రావిస్ హెడ్.. ఇప్పటి వరకు 10 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్స్ అందుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ట్రావిస్ హెడ్(59, 61) హాఫ్ సెంచరీలతో రాణించి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

ఈ మ్యాచ్‌లో ఆసీస్ 159 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో ఐసీసీ 2019లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించింది. ట్రావిస్ హెడ్ 50 మ్యాచ్‌లు ఆడి 3,233 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న జాబితాలో ట్రావిస్ హెడ్(10) తర్వాత బెన్ స్టోక్స్(5), జోరూట్(5), హ్యారీ బ్రూక్(4) ఉన్నారు.

Travis Head Creates History Becomes 1st Cricketer In The World To bag 10 POTM awards in WTC

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. అనంతరం వెస్టిండీస్ 190 పరుగులు చేసింది. 10 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(61), బ్యూ వెబ్‌స్టర్(63), అలెక్స్ క్యారీ(65) హాఫ్ సెంచరీలతో రాణించారు. షమర్ జోసెఫ్(5/87) ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఆసీస్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 141 పరుగులకే ఆలౌటైంది. షమార్ జోసెఫ్(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జస్టిన్ గ్రీవ్స్(38), జాన్ క్యాంప్‌బెల్(23), కీసే కార్టీ(20) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ట్రావిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్.. జూలై 3 నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Saturday, June 28, 2025, 18:33 [IST]
Other articles published on Jun 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+