కోహ్లీతో ఆ ఘటన.. బాధ కలిగించింది: ట్రావిస్ హెడ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో నెలకొన్న షేక్ హ్యాండ్ వివాదంపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ స్పందించాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. వ్యక్తిగతంగా ఇద్దరం సరిదిద్దుకోవాల్సిన విషయం కూడా ఏం లేదన్నాడు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వాగ్వాదం జరిగింది. మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్‌కు విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అదే బాధ కలిగించింది..
ఆర్‌సీబీ అభిమానులు ట్రావిస్ హెడ్‌తో పాటు అతని సతీమణి జెస్సికా హెడ్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ దిగారు. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన రెండు నెలల తర్వాత ట్రావిస్ హెడ్ ఈ విషయం గురించి మాట్లాడాడు.
'అది జరిగిపోయిన ఘటన. మేం సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు. జరిగినది జరిగిపోయింది. పోటీ ఎలా ఉంటుందో.. మ్యాచ్‌లో ఏం జరుగుతుందో ఊహించిందే. ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కానీ ఈ ఘటన ప్రభావం నా కుటుంబ సభ్యులపై పడటమే నాకు ఎంతో బాధ కలిగించింది.
నా సతీమణి జెస్సికా ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకుంటుంది. ఆమెపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌ను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ నా వల్ల ఆమె ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం నాకు బాధ కలిగించింది. ' అని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు.
జెస్సికా భావోద్వేగం..
అప్పట్లో తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ జెస్సికా తీవ్ర భావోద్వేగానికి గురైంది. 'వరల్డ్‌కప్ తర్వాత ఎదుర్కొన్న వేధింపులు మళ్లీ వచ్చాయనిపిస్తోంది. ఉదయం లేవగానే సోషల్ మీడియా అంతా అసభ్యకర పదజాలంతో నిండిపోయింది. మేం బాగానే ఉన్నాం. కానీ మా స్నేహితులు, కుటుంబ సభ్యులపై కూడా దాడులు చేస్తున్నారు.
ప్రస్తుతం అన్ని క్రీడల్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఒకరితో మరొకరు ప్రవర్తించే విధానం చాలా అవసరం. ఆటలో భావోద్వేగాలు సహజం. కానీ ఆటగాళ్ల వెనుక ఓ కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే విధానం రావాలి అని కోరుకుంటున్నాను'అని జెస్సికా ఆస్ట్రేలియా మీడియాతో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

