ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అంపైర్ మణిక్ గుప్తా(65) తేనెటీగల దాడిలో మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు ఆటగాళ్లతో పాటు మరో అంపైర్ గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
అండర్ 13 మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకస్మాత్తుగా మైదానంలో ఉన్నవారిపై తేనెటీగల దాడి చేయడంతో స్టేడియంలో గందరగోళం నెలకొంది. ఆటగాళ్లు, ప్రేక్షకులు ప్రాణభయంతో పరుగులు తీసారు. ఆటగాళ్లు చిన్నపిల్లలు కావడంతో వారు త్వరగా తప్పించుకోగలిగారు. కానీ 65 ఏళ్ల మణిక్ గుప్తా త్వరగా పరుగెత్తలేక తీవ్ర గాయాలపాలయ్యారు.
ఆయనను ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో మరో ఆసుపత్రికి తరిలించారు. కానీ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుప్తా శరీరంపై వందలాది చోట్ల తేనెటీగలు కుట్టడంతో విషం శరీరమంతా పాకి 'అనాఫిలాక్టిక్ షాక్'గురై మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. మరొ అంపైర్ జగదీశ్ శర్మతో సహా పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. మణిక్ గుప్తాకు కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌తో 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన అనేక ప్రాంతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు.

ఈ ఘటనపై మరో అంపైర్ సునీల్ మీడియాతో మాట్లాడారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఆటగాళ్లు నీరు తాగుతుండగా తేనెటీగల గుంపు ఆకస్మాత్తుగా దాడి చేసిందని తెలిపారు. అందరూ నేలపై పడుకోవాలని సూచించినప్పటికీ తేనెటీగల దాడి కొనసాగిందని చెప్పారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా.. క్రికెట్ వర్గాలు మాణిక్ గుప్తా మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.
క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. తేనెటీగలు దాడి చేయడం ఇదే తొలిసారి కాదు. 2019లో తిరువనంతపురం వేదికగా భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ వన్డే మ్యాచ్ తేనెటీగల దాడితో ఆగిపోయింది. ఈ ఘటనలో చాలామంది గాయపడినప్పటికీ.. ప్రాణనష్టం జరగలేదు. 2019లోనే డర్హం వేదికగా జరిగిన శ్రీలంక, సౌతాఫ్రికా ప్రపంచకప్ మ్యాచ్‌లో తేనెటీగల వల్ల దాదాపు గంటసేపు ఆటకు అంతరాయం కలిగింది. ఆటగాళ్లంతా నేలపై పడుకొని తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు.
2017లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ తేనెటీగలు ఆటకు అంతరాయం కలిగించాయి. వాటిని తొలగించడానికి మైదానంలోకి అగ్నిమాపక యంత్రాలను, ప్రొఫెషనల్ బీ-కీపర్లను పిలవాల్సి వచ్చింది.