Yearender 2020: ఫ్యాన్స్‌కు షాక్.. ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్లు వీళ్లే!!

హైదరాబాద్: 2020 ఏవిధంగానూ కలిసిరాలేదు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా క్రీడా రంగానికి చెదు అనుభావాన్ని మిగిల్చింది. వైరస్ కారణంగా ఆటగాళ్లు ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపారు. దాదాపు 5-6 నెలలు కాలు బయటకి పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు బయో బబుల్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ల జట్ల మధ్య టెస్ట్ సిరీస్ విజయవంతం అయింది. దీంతో క్రికెట్ టోర్నీలు ఊపందుకున్నాయి. అయితే మ్యాచులు అన్ని ఖాళీ స్టేడియంలలో నిర్వహించడంతో అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. ఇది చాలదన్నట్టు ఈఏడాది టాప్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఫ్యాన్స్‌ను మరింత ఏడిపించారు. వారు ఎవరో ఓసారి చూద్దాం.

ఎంఎస్ ధోనీ:
భారత క్రికెట్ చరిత్రలోనే ఎంఎస్ ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. టీ20, వన్డే ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ అందించిన ధోనీ.. ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఏకైక సారథిగా గుర్తింపు పొందాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కూడా టీమిండియాను అగ్ర స్థానానికి చేర్చిన ఘనత కూడా మహీదే. అయితే ఈ దిగ్గజ ఆటగాడు ఆగస్టు 15న అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఐపీఎల్ 2021లో మహీ ఆడడం సంతోషాన్నిచ్చే అంశం. ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు.

సురేష్ రైనా:
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది గంటలకే టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతకుముందు రైనా చాలా ఏళ్ళుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. జూలై 17, 2018న ఇంగ్లాండ్‌తో తన చివరి వన్డే ఆడారు. దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్‌ల్లో 768, వన్డేల్లో 5615, టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఏడు సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన రైనా.. టెస్ట్‌ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రైనా పేరుపై రికార్డు ఉంది.

పార్థివ్ పటేల్:
డిసెంబర్ 9న టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ కూడా ఈఏడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌తో 35 ఏళ్ల పార్థీవ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. భారత్ తరఫున 25 టెస్ట్‌లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడిన పార్థీవ్.. ఎంఎస్ ధోనీ భారత జట్టులోకి రానంతవరకు కీలక ఆటగాడిగా జట్టులో కొనసాగాడు. వన్డేల్లో 4 హాఫ్ సెంచరీలతో 736 రన్స్ చేసిన పార్థీవ్.. టెస్ట్‌ల్లో 6 హాఫ్ సెంచరీలతో 934 పరుగులు చేశాడు. 2002 ఇంగ్లండ్ పర్యటనలోని టెస్ట్ మ్యాచ్‌తో 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పార్థివ్.. ఈ ఘనతను అందుకున్న అత్యంత పిన్న వికెట్ కీపర్‌గా గుర్తింపుపొందాడు.

మహ్మద్ అమీర్:
డిసెంబర్ 17న పాకిస్థాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ పెడుతున్న టార్చర్ భరించలేక ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. టీమ్ మేనేజ్‌మెంట్ తనతో వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గతేడాది జూన్‌లో టెస్ట్‌ల నుంచి రిటైరైన అమీర్.. వన్డేలు, టీ20ల్లో మాత్రం కొనసాగాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కూడా బై చెప్పాడు. పాక్ తరఫున 36 టెస్టులాడిన అమీర్ 119 వికెట్లు పడగొట్టాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున ఈ ఏడాది ఆగస్టులో చివరగా టీ20 మ్యాచ్ ఆడాడు.

ఇర్ఫాన్ పఠాన్:
టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ ఏడాది ఆరంబంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్ నుంచి వైదొలిగాడు. 19 ఏళ్ల వయస్సులో 2003లో అరంగేట్రం చేసిన ఇర్పాన్ తన కెరీర్‌లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి 301 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టెస్టుల్లో 1105 పరుగులు, వన్డేల్లో 1544 పరుగులు సాధించాడు. టీమిండియా అందించిన ఉత్తమ ఎడమచేతివాటం స్వింగ్ బౌలర్ ఇర్ఫాన్ పఠానే. సుమారు తొమ్మిదేళ్లపాటు ఇర్ఫాన్ పఠాన్ భారత్ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

జేపీ డుమిని:
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ జేపీ డుమిని కూడా ఈ ఏడాది ఆరంబంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2004, ఆగస్టులో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డుమిని సఫారీ జట్టు తరుఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. సఫారీ జట్టు మిడిలార్డర్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. కామెంటేటర్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించనున్నాడు.

కోరె అండర్సన్:
ప్రియురాలి కోరిక మేరకు న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ కూడా డిసెంబర్ 5న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రియురాలు, తనకు కాబోయే భార్య కోరిక మేరకు కివీస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో ఆడనున్నాడు. 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా 29 ఏళ్ల కోరె కివీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భారీ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అండర్సన్ తన కెరీర్‌లో 13 టెస్టుల్లో 683 పరుగులు, 49 వన్డేల్లో 1109 పరుగులు, 31 టీ20ల్లో 485 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే టెస్టుల్లో 16, వన్డేల్లో 60, టీ20ల్లో 14 వికెట్లు తీశాడు.

షరపోవా కూడా:
వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్, దక్షిణాఫ్రికా ఆటగాడు డేన్ పియట్, పాకిస్తాన్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ కూడా ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరే కాకుండా ఇతర క్రీడలకు సంబందించిన వారు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. చైనా బ్యాడ్మింటన్ లెజెండ్ లిన్ డాన్, డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజ రెజ్లర్ ది అండర్‌టేకర్, భారత పారాథ్లెట్ దీపా మాలిక్, టెన్నిస్ అందం మరియా షరపోవా కూడా ఆటకు అల్విదా చెప్పారు.
'పుజారా కోసం మరికొన్ని వ్యూహాలూ సిద్ధంగా ఉన్నాయి.. మా ఉచ్చులో బిగిస్తాం'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications