
కింగ్ కోహ్లీ
ఐపీఎల్ 2020లో అత్యధికంగా ఆర్జిస్తున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ అయిన కోహ్లీని ఆ ఫ్రాంచైజీ 2018 సీజన్‌లో రూ.17 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్న క్రికెటర్ కోహ్లీనే. ఒక ఆటగాడిని రిటైన్ చేసుకుంటే.. ప్రాంచైజీ అతడికి రూ.15 కోట్లు అందిస్తుంది. అయితే కోహ్లీ మాత్రం రూ.17 కోట్లు ఆర్జిస్తున్నాడు. అదనంగా రెండు రూ.2 కోట్లు ఎందుకు ఎక్కువంటే?.. కోహ్లీ ఐపీఎల్ మొదటినుంచి బెంగళూరు తరపున ఆడడమే. 'లాయల్టీ బోనస్' కింద కోహ్లీకి రూ.2 కోట్లు అదనంగా అందుతున్నాయని సమాచారం.

కమిన్స్ రికార్డు
విరాట్ కోహ్లీ తర్వాత ఐపీఎల్ 2020లో అత్యధికంగా ఆర్జిస్తున్న ప్లేయర్ ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్. గతేడాది జరిగిన వేలంలో మనోడి కోసం చాలా ప్రాంచైజీలే పోటీపడ్డాయి. చివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ అతనికి 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇంత ధర పలికిన ఓవర్ సీజన్ ప్లేయర్‌గా కమిన్స్ రికార్డు కూడా నెలకొల్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో కమిన్స్ ఇప్పటివరకు 30 టెస్టుల్లో, 66 వన్డేల్లో, 30 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఎంఎస్ ధోనీ@3
మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఉన్నాడు. అతడు ఏడాదికి రూ.15 కోట్లు ఆర్జిస్తున్నాడు. చాలా ఏళ్లుగా ధోనీ చెన్నై తరపునే ఆడుతున్న విషయం తెలిసిందే. ధోనీ తన సూపర్ కెప్టెన్సీతో చెన్నై జట్టుకి మూడు టైటిళ్లు అందించాడు. అందుకే నిషేధం ముగిసిన వెంటనే చెన్నై రూ.15 కోట్లు చెల్లించి మరి మహీని రిటైన్ చేసుకుంది. అతను కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రీ ఎంట్రీ సీజన్‌లోనే చెన్నైని చాంపియన్‌గా నిలిపాడు. అంతేకాకుండా గత సీజన్‌లో ఫైనల్‌కు చేర్చి 1 పరుగు తేడాతో ట్రోఫీని చేజార్చుకున్నాడు.

నాలుగో స్థానంలో రోహిత్
క్యాష్ రిచ్ లీగ్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2020లో అత్యధికంగా ఆర్జిస్తున్న జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఎంఎస్ ధోనీతో పాటు రోహిత్ శర్మకు కూడా రూ.15 కోట్లు అందుతున్నాయి. మెగా లీగ్‌లో రోహిత్.. ముంబైకి నాలుగు టైటిళ్లు అందించాడు. గత సీజన్‌లో తన సూపర్ కెప్టెన్సీతో ఒక్క పరుగు తేడాతో చెన్నైను ఓడించి ముంబైని విజేతగా నిలిపాడు.

రిషబ్ పంత్@5
ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇదో స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ లాగే పంత్ కూడా రూ.15 కోట్లు ఆర్జిస్తున్నాడు. పంత్ 2018 ఐపీఎల్ సీజన్లో 684 పరుగులు చేశాడు. ఇక 2019లో 488 రన్స్ చేసి.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే-ఆఫ్స్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. అందుకే అతని ధర అమాంతం పెరిగిపోయింది.
ధోనీ ఆ బౌలర్‌పైనే అతిగా ఆధారపడుతున్నాడు.. టోర్నీ ఆసాంతం అతడు ఫిట్‌నెస్ కాపాడుకుంటాడా: అగార్కర్


Click it and Unblock the Notifications












