ధోనీ ఆ బౌలర్‌పైనే అతిగా ఆధారపడుతున్నాడు.. టోర్నీ ఆసాంతం అతడు ఫిట్‌నెస్ కాపాడుకుంటాడా: అగార్కర్

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) బౌలింగ్‌కు ప్రధాన ఆయుధం పేసర్ దీపక్ చహర్ అని టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అన్నాడు. అయితే చహర్ టోర్నీ ఆసాంతం ఫిట్‌నెస్ కాపాడుకుంటాడా అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక అతడు జట్టుతో ఉంటేనే సీఎస్‌కే పోటీలో ఉంటుందన్నాడు. చెన్నై స్టార్ ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌లు జట్టుకు దూరం కావడంతో సీఎస్‌కే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా కొంచెం బలహీనంగానే కనబడుతోంది. బ్యాటింగ్‌లో రైనా స్థానాన్ని మురళీ విజయ్ లేదా అంబటి రాయుడులతో పూడ్చాలని చూస్తున్న సీఎస్‌కే.. బౌలింగ్‌లో పరుగులు నియంత్రణ చేసేది ఎవరూ అనే దానిపై సతమవుతోంది.
స్టార్‌స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టడ్ షోలో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ... 'దీపక్ చహర్‌పై సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారీ ఆశలు పెట్టుకున్నాడు. చహర్‌పై మహీ చాలా ఎక్కువగా ఆధారపడతాడనే విషయం నాకు తెలుసు. కొత్త బంతిని చహర్ పంచుకోవాల్సి ఉంది. చాలాకాలం నుంచి అందరు క్రికెటర్లు తరహాలనే చహర్ కూడా సరైన ప్రాక్టీస్ లేదు. ఇక ఐపీఎల్ కోసం దుబాయ్‌కు వెళ్లిన తర్వాత కరోనా బారిన పడి హెమ్ క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. దాంతో ప్రాక్టీస్ కూడా తగ్గింది. 2018లో టైటిల్ గెలిచిన సీఎస్‌కే జట్టులో చహర్ సభ్యుడు. ప్రస్తుతం సీఎస్‌కేకు చహర్ చాలా ముఖ్యమైన ఆటగాడు' అని అన్నాడు.

'దీపక్ చహర్ ఇన్నింగ్స్ ఆరంభంలో లైన్ అండ్ లెంగ్త్‌ను దొరకబుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గతేడాది డిసెంబర్‌లో చహర్ వెన్నుగాయంతో బాధపడ్డాడు. ఏప్రిల్ వరకూ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. ఇప్పుడు అతను ఫిట్‌నెస్‌ను కాపాడుకుని కడవరకూ నిలబడాలి. ఎంఎస్ ధోనీ ఎక్కువ ఆశలు పెట్టుకున్న బౌలర్ చహర్ సీజన్ అయ్యేంతవరకూ జట్టుతో ఉంటేనే సీఎస్‌కే పోటీలో ఉంటుంది' అని అజిత్ అగార్కర్ తెలిపాడు. ఈనెల 19న అబుదాబిలో ముంబై ఇండియన్స్‌తో సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన సీఎస్‌కే బృందంలో మొత్తం 13 మంది సభ్యులు కరోనా బారిన పడ్డారు. ఇందులో ఇద్దరు క్రికెటర్లు దీపర్ చహర్, రుతురాజ్ గ్వైక్వాడ్‌లు ఉన్నారు. చహర్ కరోనా నుంచి కోలుకుని ప్రాక్టీస్ చేస్తుండగా.. రుతురాజ్ మాత్రం ఇంకా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాడు. బ్యాట్స్‌మన్, ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన గ్వైక్వాడ్‌పై కూడా సీఎస్‌కే ఆశలు పెట్టుకుంది. అయితే తొలి మ్యాచుకు అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అతడు ఇప్పటి వరకు నెట్ సెషన్‌లోనూ పాల్గొనలేదు. సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలంటే అతడు ఫిట్‌నెస్ పరీక్షలో పాస్‌కావాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications