
స్మృతి మంధాన..
క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. బ్యూటీ విత్ టాలెంట్ అనే వాక్యానికి సరైన అర్థం స్మృతి అని చెప్పొచ్చు. మైదానంలో బ్యాట్‌తో కుర్రకారు మనసును దోచేస్తోంది. స్టార్ ఓపెనర్‌గా ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను చీల్చి చెండాడే స్మృతి చిరునవ్వంటే పడి చచ్చిపోని క్రికెట్ అభిమాని లేరు. బాగా ఆడిన ప్రతీసారి ఆమె చిరునవ్వు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అవుతుంటుంది. వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ప్రతీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ స్టేటస్‌ల్లో మారుమోగుతుంది. భారత్ తరఫున 78 టీ20లు, 56 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఈ బ్యూటీ.. మొత్తం 4,035 రన్స్ చేసింది.

మనూ భాకర్..
మనూభాకర్ అతి చిన్న వయసులోనే ప్రపంచంలో మేటి షూటర్‌గా పేరుతెచ్చుకుంది. ఆటతోనే కాక అందంతోనే ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడంపైనే దృష్టిసారించింది. అందుకోసం శిక్షణ తీసుకుంటూనే చదువునూ కొనసాగిస్తోంది. 2017లో ఆసియన్ జూనియర్ ఛాంపియన్ షిప్లో రజత పతకం గెలిచింది. అదే ఏడాది జరిగిన జాతీయ క్రీడల్లో 9 స్వర్ణాలు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. వీటితో పాటు యూత్ ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లోనూ పతకాలు గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈమె శిక్షణలో ఉంది.

దీపిక పల్లికల్..
భారత స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్.. ఈమె అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్‌ను దీపిక వివాహమాడింది. తన అందచందాలతో కుర్రకారు మనసులను దోచుకుంది. కార్తీక్ కూడా ఆమెను ప్రేమ వివాహమే చేసుకున్నాడు. స్క్వాష్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 సాధించిన తొలి భారత ప్లేయర్ దీపిక. స్క్వాష్ ప్లేయర్‌గా దీపిక భారత్‌కు ఎన్నో పతకాలు అందించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్స్ విభాగంలో గోల్డ్, 2018లో టీమ్ విభాగంలో రెండు రజత పతకాలు గెలుపొందింది. ఆసియా గేమ్స్‌లో ఓ రజత పతకంతో పాటు మూడు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది.

ప్రాచీ తెహ్లాన్
భారత నెట్‌బాల్, బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రాచీ తెహ్లాన్‌ను చూస్తే బాలీవుడ్ హీరోయినే అనుకుంటారు. ఆమె ఆట కంటే అందాన్ని అభిమానించేవారే ఎక్కువ. దియా ఔర్ బాతీ హమ్' అనే పాపులర్ హిందీ సీరియల్లోనూ ప్రాచీ నటించింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు ఏషియన్ గేమ్స్‌లోనూ మహిళల నెట్‌బాల్ జట్టుకు ఈమె నాయకత్వం వహించింది. 2011 సౌత్ ఏషియన్ బీచ్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్.. 2011 నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ నెగ్గింది. ప్రస్తుతం నటిగా సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న ప్రాచీ.. పంజాబ్ మూవీస్‌లో నటిస్తుంది.

షర్మిళా నికోలెట్
భారత మహిళా గోల్ఫ్ ప్లేయర్ షర్మిళా నికోలెట్ అందం ముందు సీని హీరోయిన్లు కూడా పనికిరారు. బెంగళూరుకు చెందిన ఈ గోల్ఫ్ ప్లేయర్.. విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో అప్పట్లో డేటింగ్ చేసిందనే వార్తలు హల్‌చల్ చేశాయి. నికోలెట్ భారత తరఫున పలు టోర్నీల్లో బరిలోకి దిగింది. 2009లో ప్రొఫెసనల్ గోల్ఫర్‌గా మారిన నికోలెట్.. పలు అవార్డులతో పాటు ఘనతలను అందుకుంది.


Click it and Unblock the Notifications












