IPL 2026: పవర్ హిట్టర్‌తో పాటు ఆ ముగ్గురిపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్!
ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలం కోసం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) వ్యూహాలు రచిస్తోంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరిగే మినీ వేలంలో కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేయాలనే లక్ష్యంతో రుతురాజ్ సేన ఉంది. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా 10 మంది ఆటగాళ్లను సీఎస్‌కే వేలంలోకి వదిలేసింది. ఆటగాళ్ల స్వాప్ ట్రేడ్ డీల్ నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సామ్ కరణ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చేసి ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను టీమ్‌లోకి తెచ్చుకుంది.
10 మంది ఆటగాళ్లను వదిలేయడంతో పాటు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో చెన్నై సూపర్ కింగ్స్ పర్స్‌లో రూ.43.4 కోట్ల భారీ సొమ్ము ఉంది. రిటెన్షన్ ప్రక్రియ అనంతర సీఎస్‌కేకు ఓవర్‌సీస్ ఓపెనర్‌తో పాటు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ పేసర్, జడేజా స్థానాన్ని భర్తీ చేసే ఇండియన్ ఆల్‌రౌండర్, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఆడగల స్పిన్నర్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు సీఎస్‌కే ప్రధానంగా నలుగురు ఆటగాళ్లను టార్గెట్‌గా పెట్టుకుంది.

1. ఆండ్రీ రస్సెల్
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్‌ను సీఎస్‌కే కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం కేకేఆర్‌కు ఆడిన అతన్ని ఆ జట్టు వదిలేసింది. రస్సెల్‌తో సామ్ కరణ్ స్థానాన్ని భర్తీ చేయాలనే ఆలోచనతో సీఎస్‌కే ఉంది. లోయరార్డ్‌లో దూకుడుగా ఆడే సామర్థ్యంతో పాటు మిడిల్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసే సత్తా రస్సెల్‌కు ఉంది. ప్రస్తుతం సీఎస్‌కే స్కౌట్‌గా ఉన్న ఏఆర్ శ్రీకాంత్ గతంలో కేకేఆర్‌కు స్కౌట్‌గా పనిచేశాడు. రస్సెల్‌ను ఆ జట్టు రిలీజ్ చేయగానే.. ఏఆర్ శ్రీకాంత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. రస్సెల్ లోడింగ్ అని ఫొటో పెట్టాడు. ఈ క్రమంలోనే సీఎస్‌కేకు రస్సెల్ ప్రధాన టార్గెట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అతను వేలంలో చిక్కకపోతే కామెరూన్ గ్రీన్‌ను కొనుగోలు చేసే ప్రయత్నం చేయవచ్చు.
రవి బిష్ణోయ్/ రాహుల్ చాహర్
నూర్ అహ్మద్‌కు తోడుగా రవి బిష్ణోయ్‌ను కొనుగోలు చేసే ప్రయత్నం చేయవచ్చు. అతను చిక్కకపోతే లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను కోనుగోలు చేసే అవకాశం ఉంది. చెన్నైలోని చెపాక్ మైదానానికి రాహుల్ చాహర్ బౌలింగ్ సరిగ్గా సరిపోతుంది.
3. గెరాల్డ్ కోయిట్జీ..
మతిష పతీరణ స్థానాన్ని భర్తీ చేసేందుకు గెరాల్డ్ కోయిట్జీని సీఎస్‌కే కొనుగోలు చేయవచ్చు. అతనికి బ్యాకప్‌గా లుంగి ఎంగిడి, మోహిత్ శర్మ, ఆకాశ్ దీప్ వంటి పేస్ బౌలర్లను కూడా సీఎస్‌కే ఆప్షన్లుగా పెట్టుకున్నట్లు అర్థమవుతుంది. మతీష పతీరణను తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం కూడా సీఎస్‌కే చేసే అవకాశాలు ఉన్నాయి.
4. ఫాఫ్ డుప్లెసిస్..
విదేశీ టాపార్డర్ బ్యాటర్‌గా క్వింటన్ డికాక్, ఫాఫ్ డుప్లెసిస్‌లో ఒకర్ని సీఎస్‌కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫాఫ్ డుప్లెసిస్ గతంలో సీఎస్‌కే అద్భుతమైన ఆరంభాలను అందించాడు. కొత్త కుర్రాళ్ల కోసం కూడా సీఎస్‌కే అన్వేషణ మొదలుపెట్టింది.
సీఎస్‌కే రిలీజ్ లిస్ట్:
రాహుల్ త్రిపాఠి, వాన్ష్ బేడీ, ఆండ్రూ సిద్దార్థ్, రచిన్ రవీంద్ర, సామ్ కరణ్(ట్రేడ్ ఔట్), దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగర్‌కోటి, మతీష పతీరణ, రవీంద్ర జడేజా(ట్రేడ్ ఔట్), రవిచంద్రన్ అశ్విన్(రిటైర్మెంట్)
సీఎస్‌కే రిటైన్ లిస్ట్:
రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, మహేంద్ర సింగ్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజూ శాంసన్(ట్రేడ్ ఇన్), డేవాన్ కాన్వే, శివమ్ దూబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి.
పర్స్ వాల్యూ: రూ. 43.4 కోట్లు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications