Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరంటే..?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి భారత మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్‌గా నిలిచాడు. భారత్‌లో అత్యంత ఆదరణ కలిగిన టాప్10 క్రీడాకారుల జాబితాను Ormax Sports Stars మంగళవారం ప్రకటించింది.

ఆగస్ట్ నెలలో అత్యంత ఆదరణ కలిగిన టాప్ 10 ఆటగాళ్ల కోసం సదరు సంస్థ సర్వే నిర్వహించింది. టాప్ 10 ఆటగాళ్లలో ఐదుగురు క్రికెటర్లే ఉండటం విశేషం. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా.. మహేంద్ర సింగ్ ధోనీ రెండో స్థానాన్ని అందుకున్నాడు. రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలవగా.. ఫుట్‌బాల్ స్టార్, పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియన్ రోనాల్డో నాలుగో స్థానంలో నిలిచాడు.

Top 10 Most Popular Sports Person in India You May Know

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐదో స్థానంలో నిలవకగా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఆరో స్థానాన్ని అందుకున్నాడు. భారత బళ్లెం వీరుడు, గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా ఏడో స్థానంలో నిలవగా.. భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ 8వ స్థానాన్ని అందుకున్నాడు.

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు 9వ స్థానంలో నిలవగా.. హార్దిక్ పాండ్యా 10వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే మోస్ట్ బ్రాండ్ వాల్యూ కలిగిన భారత క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ నిలిచిన విషయం తెలిసిందే. ఇన్‌స్టా, ట్విటర్ వేదికగా అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్ కూడా కోహ్లీనే కావడం గమనార్హం.
టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోని రెండేళ్లు అవుతున్నా.. అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ రెండో స్థానంలో నిలవడం విశేషం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉండగా.. సచిన్ టెండూల్కర్ కన్నా ముందు లియోనల్ మెస్సీ ఉండటం గమనార్హం.

Story first published: Tuesday, September 24, 2024, 20:26 [IST]
Other articles published on Sep 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+