Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tom Latham: ఆ ఇద్దరే మా ఓటమిని శాసించారు

SA vs NZ: క్వింటన్ డికాక్, రాసీ వాన్ డెర్ డస్సెన్ అసాధారణ బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాసించారని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 190 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయిన న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

సెమీస్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఘోర పరాజయంపై స్పందించిన టామ్ లాథమ్(Tom Latham) తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయామని తెలిపాడు.

 Tom Latham says We were put under pressure by QDK and Rassie after SA BIG win vs NZ in CWC 2023

'మా అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చలేకపోయాం. క్వింటన్ డికాక్, రాసీ వాన్ డెర్ డస్సెన్ సూపర్ బ్యాటింగ్‌తో మేం ఒత్తిడికి గురయ్యాం. లక్ష్యచేధనలో ఆరంభంలోనే ఐదు వికెట్లు కోల్పోవడం తీవ్రంగా నిరాశపరిచింది. ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందని నేనేం అనుకోవడం లేదు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది.

మేం సౌతాఫ్రికా 330-340 కట్టడి చేసుంటే బాగుండేది. బ్యాటింగ్‌లో మేం మా అవాకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం. గాయాలు మాకు ప్రతికూలంశాలు. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి. తదుపరి మ్యాచ్‌లో మెరుగైన పరదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం.'అని టామ్ లాథమ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 357 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114), రాసీ వాన్ డెర్ డస్సెన్(118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ మిల్లర్(30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(2/77) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్‌లకు తలో వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ ఓవర్లలో పరుగులకు కుప్పకూలింది. కేశవ్ మహరాజ్(4/46), మార్కో జాన్సెన్(3/31) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. కగిసో రబడా(1/16), గెరాల్డ్ కోయిట్జీ(1/41) తలో వికెట్ తీసారు. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లేన్ ఫిలిప్స్(49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. విల్ యంగ్(33), డారిల్ మిచెల్(24) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

Story first published: Wednesday, November 1, 2023, 22:21 [IST]
Other articles published on Nov 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+