Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tom Latham: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం!

Tom Latham: మ్యాచ్ ఆరంభం నుంచే ఆస్ట్రేలియా తమపై ఒత్తిడి పెట్టిందని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడినందుకు సంతోషంగా ఉందన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన టామ్ లాథమ్.. భారీ లక్ష్య చేధనలో శుభారంభం అందుకోకపోవడంతో పాటు ఒత్తిడికి లోనవ్వడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. 'క్రికెట్‌లోనే ఇదో అద్భుతమైన మ్యాచ్. మ్యాచ్ ఆసాంతం ఉత్కంఠగా సాగింది. విజయానికి చేరువగా వచ్చి ఓడిపోవడం తీవ్రంగా నిరాశపరిచింది.

Tom Latham says Australia put us on back foot After New Zealand loss in high scoring encounter

ఆరంభం నుంచి ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. గ్లేన్ ఫిలిప్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓ పార్ట్‌టైమ్ బౌలర్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీయడం గొప్ప విషయం. కీలక సమయంలో అతను రాణించడంతో ఆసీస్ భారీ స్కోర్‌ను అడ్డుకోవడానికి ఉపయోగపడింది.

400 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగినప్పుడు మంచి ఆరంభం దక్కడం కీలకం. విల్ యంగ్, డెవాన్ కాన్వే ఈ రోజు విఫలమయ్యారు. మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. రచిన్ రవీంద్ర మాత్రం అసాధారణంగా బ్యాటింగ్ చేశాడు. అత్యుత్తమైన నాక్ ఆడాడు. మ్యాచ్ ఆడేందుకు ధర్మశాల అనువైన ప్రాంతం. అద్భుతమైన వాతావరణం. రగ్బీ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా.'అని టామ్ లాథమ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు కుప్పకూలింది. ట్రావిస్ హెడ్(67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్(65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీతో రాణించాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), ప్యాట్ కమిన్స్(14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37) మెరుపులు మెరిపించారు.

న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(3/77), గ్లేన్ ఫిలిప్స్(3/37) మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్(2/80) రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులే చేసి ఓటమిపాలైంది. రచిన్ రవీంద్ర(89 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 116) శతక్కొట్టగా.. డారిల్ మిచెల్(51 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 54), జేమ్స్ నీషమ్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Saturday, October 28, 2023, 19:58 [IST]
Other articles published on Oct 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+