
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సుదీర్ఘకాలం ఆడిన డేవిడ్ వార్నర్.. గత ఏడాదన్నరగా తెలుగు సినిమాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నాడు. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమా పాటలకి తన భార్య, పిల్లలతో కలిసి డ్యాన్స్ చేసిన డేవిడ్ వార్నర్.. ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇటీవల 'పుష్ప' సినిమాలోని 'ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. తగ్గేదేలె' అంటూ ఫొటో మార్ఫ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకున్నాడు. .

కోహ్లీ సెటైర్స్..
డేవిడ్ వార్నర్ వీడియోకి ఊహించని విధంగా అభిమానుల నుంచి స్పందన లభించింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ''వార్నర్ నువ్వు బాగానే ఉన్నావా?'' అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. దీనికి వార్నర్ సైతం తనదైన శైలిలో బదులిచ్చాడు. 'నువ్వు నా తల గురించే అడుగుతున్నావని తెలుసు.. కొంచెం గొంతు పట్టేసిందంతే' అని రిప్లే ఇచ్చాడు. ఇక సన్‌రైజర్స్ అభిమానులు అయితే ఈ వీడియోను చూసి తెగ సంతోషపడ్డారు. కామెంట్లతో ముంచెత్తారు. 'కోకో కోలా పెప్సీ.. డేవిడ్ భాయ్ సెక్సీ.. వార్నర్ అంటే ఫైర్.. ఫ్లవర్ అనుకుంటివా.. 'నీ అవ్వ తగ్గేదేలే.. డేవిడ్ పుష్ప.. వార్నర్ భాయ్.. మీరు త్వరగా రిటైర్ అయి.. తెలుగు సినిమాల్లో నటించండి'అంటూ కామెంట్ చేశారు.

బుట్ట బొమ్మాకు కూడా..
ఇక గతంలో కూడా వార్నర్.. అల్లు అర్జున్ పాటకు చిందేశాడు. అలవైకుంఠపురంలోని బుట్ట బొమ్మ పాటకు సతీమణి క్యాండీస్ వార్నర్‌తో కలిసి చిందేసాడు. అప్పట్లో ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. ఎంతలా అంటే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో పాటు హీరో అల్లు అర్జున్ స్పందించేంత పాపులర్ అయింది. తెలుగు ప్రేక్షకులకు ఇంత దగ్గరైన వార్నర్.. వచ్చే సీజన్ నుంచి హైదరాబాద్‌కు ఆడడంటే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌తో వచ్చిన విభేదాల కారణంగా వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దూరం కానున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో సన్‌రైజర్స్ వార్నర్‌ను రిటైన్ చేసుకోలేదు. కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను తీసుకుంది.

సూపర్ ఫామ్‌లో వార్నర్..
ఇక టీ20 ప్రపంచకప్‌లో ఫామ్ అందుకున్న డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియాకు టైటిల్‌కు అందించడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. అదే ఫామ్‌ను ప్రస్తుత యాషెస్ సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 94 రన్స్ చేసిన వార్నర్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక వార్నర్ వచ్చే సీజన్‌లో కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో లేదా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడే అవకాశం ఉంది. వార్నర్‌ను తీసుకునేందుకు ఆర్‌సీబీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












