చెన్నై: తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే సవాల్ చేయడం చర్చనీయాంశమైంది. క్రికెట్ నిబంధనలను ఉపయోగించుకోవడంలో అశ్విన్‌కు సాటిలేరు. ఇప్పటికే చాలా సందర్భంలో అశ్విన్ ఎవరికీ తెలియని క్రికెట్ నిబంధనలను వాడుకొని వార్తల్లో నిలిచాడు.
ఐపీఎల్‌లో జోస్ బట్లర్‌ను మన్కడింగ్ పద్దతిలో రనౌట్ చేసి తీవ్ర చర్చకు తెరలేపాడు. అశ్విన్ చేసిన ఈ పనితో క్రికెట్ నిబంధనలను రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఈ తరహా రనౌట్‌ను నైతికం చేసింది. ఆ తర్వాత రిటైర్డ్ ఔట్ అనే నిబంధనను కూడా అశ్వినే ఉపయోగించుకున్నాడు. జట్టు ప్రయోజనాల కోసం రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దిండిగల్ డ్రాగాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అశ్విన్.. ఓ వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే సవాల్ చేశాడు. బాల్సీ ట్రిచీ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్ రాజ్‌కుమార్‌ను అశ్విన్ కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. అంపైర్ కూడా ఔటిచ్చాడు. కానీ రాజ్‌కుమార్ రివ్యూ తీసుకోగా.. రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి బ్యాట్‌కు తాకలేదని నాటౌట్ ఇచ్చాడు.
కానీ అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తాకినట్లు స్పైక్ కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం నాటౌటిచ్చాడు. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అశ్విన్.. థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే సవాల్ చేస్తూ రివ్యూ తీసుకున్నాడు. దాంతో మరోసారి థర్డ్ అంపైర్ రిప్లేలను పరిశీలించి నాటౌటిచ్చాడు. అల్ట్రా ఎడ్జ్‌లోని స్పైక్.. బ్యాట్ నేలకు తాకడంతో వచ్చిందని వివరణ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్‌లో ఇలా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేయడం ఇదే తొలిసారి. దాంతో నెటిజన్లు అశ్విన్‌ను కొనియాడుతున్నారు. 'ఏం గుండెరా అది.. థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే సవాల్ చేశావ్!'అనే సినీ డైలాగ్‌తో మీమ్స్ పేల్చుతున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. పిచ్ పేస్‌కు అనుకూలిస్తుందని పొరబడిన టీమిండియా.. ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగి మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమితో భారత్‌కు తిరిగి వచ్చిన అశ్విన్.. రెస్ట్ తీసుకోకుండా టీఎన్‌పీఎల్ బరిలోకి దిగాడు.
తొలి మ్యాచ్ రెండో బంతికే వికెట్ తీసాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులిచ్చిన అశ్విన్.. 2 వికెట్లు తీయడంతో పాటు ఒక ఓవర్ మెయిడిన్ చేశాడు.