Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

TNPL 2023: క్రేజియేస్ట్ రనౌట్.. ఎవ్వడు పట్టించుకోలేదు! బచాయించిన బ్యాటర్!(వీడియో)

చెన్నై: తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్ల అలసత్వం బ్యాటర్‌కు కలిసొచ్చింది. ఓ క్రేజియేస్ట్ రనౌట్ చరిత్రకు ఎక్కలేకపోయింది. లికా కోవై కింగ్స్, సేలం స్పార్టాన్స్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కోవై కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ సుజయ్(32 బంతుల్లో 6 ఫోర్లతో 44).. ఫీల్డర్ల అలసత్వంతో రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

అభిషేక్ తన్వార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి సుజయ్ క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. ఫీల్డర్ వేసిన త్రో నేరుగా వికెట్లను తాకి దూరంగా వెళ్లింది. దాంతో బ్యాటర్లు రెండో పరుగు కూడా తీసారు. తీరా రిప్లేలో తొలి పరుగు తీసేటప్పుడే సుజయ్ రనౌట్ అయినట్లు స్పష్టంగా కనబడింది.

TNPL 2023: A craziest run out not referred by the on field umpire and no one appealed as well

బంతిని తప్పించుకునే క్రమంలో సుజయ్ జంప్ చేయగా.. అది నేరుగా వికెట్లు తాకింది. అప్పటికీ సుజయ్ బ్యాట్‌తో పాటు తన కాలును కూడా క్రీజులో పెట్టలేదు. క్రీజులోకి వచ్చినంక జంప్ చేయడంతో రనౌట్ కాదని ఫీల్డర్లతో పాటు అంపైర్లు భావించారు. దాంతో థర్డ్ అంపైర్‌కు కూడా రిఫర్ చేయలేదు. కానీ రీప్లేలను చూసిన ఫీల్డర్లు నెత్తికి చేతులు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. క్రేజియెస్ట్ రనౌట్ మిస్సయ్యిందని ఫీల్డర్లను విమర్శిస్తున్నారు. ఈ అవకాశంతో చెలరేగిన సుజయ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సాయి సుదర్శన్‌తో కలిసి రెండో వికెట్‌కు 75 పరగులు జోడించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లికా కోవైల్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. రామ్ అర్‌వింధ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. సాయి సుదర్శన్(28 బంతుల్లో 6 ఫోర్లతో 41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సేలం 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Story first published: Tuesday, June 27, 2023, 22:30 [IST]
Other articles published on Jun 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+