
బీసీసీఐ అభ్యర్థన:
దేశవాళీ క్రికెట్‌లో భాగంగా మరికొద్ది రోజుల్లో విజయ్ హజారే వన్డే ట్రోఫీ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీ నటరాజన్ తమిళనాడు తరఫున ఆ టోర్నీలో ఆడాల్సి ఉంది. అయితే వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు నటరాజన్‌ను టీమిండియా కోసం విడిచిపెట్టాలని బీసీసీఐ తాజాగా టీఎన్‌సీఏను కోరింది. బీసీసీఐ కోరడంతో టీఎన్‌సీఏ అందుకు అంగీకరించింది. నటరాజన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకోనున్నాడు.

టీఎన్‌సీఏ అంగీకారం:
'ఇంగ్లండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు టీ నటరాజన్ తాజాగా ఉండాలని బీసీసీఐ, భారత టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటున్నాయి. భారత జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మేం అంగీకరించాం' అని టీఎన్‌సీఏ కార్యదర్శి ఆర్‌ఎస్ రామస్వామి గురువారం మీడియాకు చెప్పారు. నట్టూ స్థానంలో జగన్నాథ్ శ్రీనివాస్ అనే ఆటగాడిని తమ జట్టులో చేర్చుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని టీఎన్‌సీఏ చీఫ్ సెలెక్టర్ వాసుదేవన్ కూడా ధ్రువీకరించారు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలోనూ మరోసారి సత్తా చాటాలని చూస్తోంది.

మూడు ఫార్మాట్లలో అరంగేట్రం:
భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తోంది. ఈ టెస్టు సిరీస్ అనంతరం ఇరు జట్లు ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీ నటరాజన్‌ను ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. నట్టూ ఇంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో రాణించి అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఒకేసారి మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

కంగారూ బ్యాట్స్‌మన్‌ను కంగారు పెట్టాడు;
టీ నటరాజన్ ఐపీఎల్ 2020లో ఆకట్టుకోవడంతో టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఆటగాళ్ల గాయాల కారణంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. తొలుత మూడో వన్డేలో అవకాశం రావడంతో రెండు వికెట్లు తీశాడు. ఆ ప్రదర్శనతో టీ20 జట్టులో అడుగుపెట్టాడు. 6 వికెట్లు తీయడంతో భారత్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టెస్టు సిరీస్‌లో భారత ప్రధాన పేసర్లంతా గాయపడడంతో నటరాజన్‌కు ఈ ఫార్మాట్‌లోనూ అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఆకట్టుకున్నాడు. పదునైన యార్కర్లు, లెంగ్త్ బంతులతో కంగారూ బ్యాట్స్‌మన్‌ను కంగారు పెట్టాడు.
స్టార్ ఓపెనర్‌కు షాక్.. బట్లర్, బెయిర్‌స్టో రీఎంట్రీ! భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ఇదే!


Click it and Unblock the Notifications












