స్టార్ ఓపెనర్‌కు షాక్.. బట్లర్, బెయిర్‌స్టో రీఎంట్రీ! భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ఇదే!

లండన్: ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఆపై టీ20, వన్డే సిరీస్‌లను ఆడనుంది. అయితే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురువారం ప్రకటించింది. మార్చి 12 నుంచి 20 మధ్య అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. టీ20 స్పెషలిస్టులతో కూడిన జట్టుకు నడిపించనున్నాడు.

లివింగ్‌స్టోన్‌కు చోటు:
ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టోలు రీఎంట్రీలు ఇచ్చారు. భారత్‌తో జరిగిన తొలి టెస్టు తర్వాత బట్లర్ స్వదేశానికి తిరిగి వెళ్లగా.. రొటేషన్ పాలిసీలో భాగంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు బెయిర్‌స్టో దూరమయ్యాడు. టెస్టు కెప్టెన్ జో రూట్‌కు టీ20 జట్టులో ఈసీబీ చోటివ్వలేదు. బిగ్ బాష్‌లో పెర్త్ స్క్రాచర్స్ తరఫున ఆడిన లియామ్ లివింగ్‌స్టోన్‌కు టీ20 జట్టులో చోటు దక్కింది. 14 ఇన్నింగ్స్‌ల్లో 426 పరుగులు చేశాడు. సంచలన ఆటగాడు డేవిడ్ మలన్‌కు అవకాశం దక్కింది.

హేల్స్‌కు ఈసీబీ షాక్:
ఇక బిగ్ బాష్ లీగ్‌లో 161.60 స్ట్రైక్ రేట్‌తో 543 పరుగులు చేసిన స్టార్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌కు ఈసీబీ షాక్ ఇచ్చింది. పరుగుల వరద పారించిన అతడికి టీ20 జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. 2019 ప్రపంచకప్‌కు ముందు నిర్వహించిన డ్రగ్ టెస్టులో విఫలమైనప్పటి నుంచి ఈసీబీ హేల్స్‌ను పట్టించుకోవడం లేదు. పేసర్ జేక్ బాల్, స్పిన్నర్ మ్యాట్ పార్కిన్సన్‌లను రిజర్వ్ ఆటగాళ్లుగా ఇంగ్లీష్ బోర్డు ఎంపిక చేసింది. వన్డే సిరీస్ కోసం జట్టును ఈసీబీ త్వరలోనే ప్రకటించనుంది.

పటిష్టంగా ఇంగ్లండ్:
ఇంగ్లండ్ జట్టు ఫిబ్రవరి 26న భారత్‌కు బయలుదేరుతుందని, అహ్మదాబాద్‌లో ఐదు టీ20 మ్యాచ్‌లను ఆడనుందని ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు తన వెబ్‌సైట్‌లో తెలిపింది. కెప్టెన్ మోర్గాన్‌తో పాటు ఆల్‌రౌండర్ స్టోక్స్, సీనియర్ వికెట్ కీపర్ బట్లర్, ఓపెనర్ బెయిర్‌స్టో, యువ డేవిడ్ మలన్‌తో ఆ జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్, సామ్ కర్రన్, మొయిన్ అలీతో కూడా బౌలింగ్ పటిష్టంగానే ఉంది.

ఇంగ్లండ్ టీ20 జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జొస్ బట్లర్, సామ్ కర్రన్, టామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, మార్క్ వుడ్.
India vs England: 'కోహ్లీ అలాంటోడు కాదు.. కుల్దీప్‌కు చోటివ్వకపోవడానికి కారణం ఇదే'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications