Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇక ఇంటికి వెళ్లి విజిల్స్ వేసుకోండి: CSK ఫ్యాన్స్‌కు ఇషాన్ కిషన్ సైగలు(వీడియో)

చెన్నై సూపర్ కింగ్స్‌(సీఎస్‌కే) అభిమానులను సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) వైస్ కెప్టెన్ ఇషాన్ కిషన్ దారుణంగా ట్రోల్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానంతరం సీఎస్‌కే అభిమానులను ఉద్దేశించి ఇషాన్ కిషన్ పలు సైగలు చేశాడు.సీఎస్‌కే ఓటమిని గుర్తు చూస్తూ.. ఇంటికి వెళ్లి విజిల్స్ వేసుకోవాలని, ఇక్కడి నుంచి దొబ్బేయండని ఆగ్రహంగా సూచించాడు.

సన్‌రైజర్స్ గెలిచిన వెంటనే చెన్నై అభిమానులపై ఇషాన్ అసహనం వ్యక్తం చేశాడు. విజిల్స్ వేయడం ఆపేసి ఇంటికి దొబ్బేయాలని తన సైగలతో సూచించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

విజిల్స్‌తో చికాకు తెప్పించడంతో..

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే మైదానం మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో నిండిపోయింది. మ్యాచ్ అసాంతం చెన్నై అభిమానులు విజిల్స్‌తో తమ జట్టుకు అండగా నిలిచారు.

ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసిన సమయంలోనూ తమ విజిల్స్‌తో చికాకు తెప్పించారు. అతను ఔటైన సందర్భంలోనూ గట్టిగా అరిచారు. దాంతో తీవ్ర అసహనానికి గురైన ఇషాన్ కిషన్.. మ్యాచ్ ముగిసిన వెంటనే ఇక ఇంటికి వెళ్లి విజిల్స్ వేసుకోవాలని ఆగ్రహంగా సూచించాడు.

Ishan Kishan Mocks CSK Fans and Takes a Dig at Whistle Podu Anthem After SRH s Win
Photo Credit: screen grab for JioHotstar

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై అభిమానులను ఇషాన్ ఎగతాళి చేయడం సరికాదని కొందరంటే.. వారికి ఇలానే బుద్ది చెప్పాలని మరికొందరు అతనికి అండగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా..ఇది ఇక్కడితో ఆగిపోదని, వచ్చే సీజన్‌లో కూడా కొనసాగుతోందని మరికొందరు హెచ్చరిస్తున్నారు.

గెలిపించిన ఇషాన్ కిషన్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల‌కు 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కార్తీక్ శర్మ(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగలకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్ (26 బంతుల్లో 6 ఫోర్లతో 47) సత్తా చాటాడు. సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్ చౌదరి రెండు వికెట్లు తీయగా.. అకీల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ తీసారు.

Story first published: Tuesday, May 19, 2026, 6:15 [IST]
Other articles published on May 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+