Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tim Paine: మహిళతో అసభ్యకర చాటింగ్.. ఆస్ట్రేలియా కెప్టెన్ రాజీనామా!

 Tim Paine Steps Down As Australia Test Captain Over Sexting Scandal

సిడ్నీ: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఓ మహిళకు అసభ్యకర సందేశాలు పంపాడన్న ఆరోపణలతో తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. 2017లో తనకు సన్నిహితంగా ఉన్న ఓ మహిళకు టిమ్‌పైన అసభ్యకర రీతిలో తన ఫొటోతో సహా పలు సందేశాలు పంపాడని ఇటీవల క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) చేపట్టిన విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే తాను ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌గా ఉండేందుకు అనర్హుడినని పేర్కొంటూ టిమ్ పైన్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చాడు. ఇది కష్టతరమైన నిర్ణయమే అయినా.. తనకూ, తన కుటుంబంతోపాటు ఆస్ట్రేలియా క్రికెట్‌కు మంచిదని తెలిపాడు.

కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా..

కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా..

'ఆస్ట్రేలియా టీమ్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. ఇది చాలా కఠినమై నిర్ణయం. కానీ నా కుటుంబానికి, జట్టుకు ఇది సరైన నిర్ణయమే. మంచిదే. నాలుగేళ్ల క్రితం సహచర మహిళా ఉద్యోగి‌తో రహస్య చాటింగ్ జరిపాను. అవి అభ్యతరకరంగానే ఉన్నాయి. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా విచారణ జరిపింది. అయితే నేను క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపింది. నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. నా భార్యతో ఈ విషయమై మట్లాడాను. అన్నీ ఆలోచించుకుని నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చాను.

 రహస్య చాటింగ్‌తో..

రహస్య చాటింగ్‌తో..

నా రహస్య చాటింగ్ పబ్లిక్‌‌లోకి వచ్చింది. 2017లో నేను చేసిన ఈ చెత్త పనితో ఆస్ట్రేలియా క్రికెట్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయి. క్రికెట్ ప్రతిష్టకు భంగం కలిగించనందుకు అందరికీ క్షమాపణలు చెబుతున్నా. నా భార్య, ఇతర కుటుంబ సభ్యులకు మనో వేదన కలిగించినందుకు బాధగా ఉంది. కెప్టెన్‌గా తప్పుకోవడం సరియైన నిర్ణయంగానే భావిస్తున్నాను. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు ముందు ఇది ఎటువంటి నష్టం కలిగించదని భావిస్తున్నా.

అందరికి సారీ..

అందరికి సారీ..

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఇలాంటి మేటి జట్టుకు నాయకత్వం వహించడం నా జీవితంలో మర్చిపోలేను. నా సహచరుల మద్దతుకు ధన్యావాదాలు. నా ప్రవర్తనతో ఆస్ట్రేలియా అభిమానులతో పాటు నా కుటుంబసభ్యులకు బాధ కలిగించనందుకు వారికి క్షమాపణలు చెబుతున్నా. ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ గా వైదొలిగినా.. ఓ వికెట్ కీపర్ గా జట్టులో కొనసాగుతా.. ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ గెలిచేందుకు నా వంతు ప్రయత్నిస్తా'టిమ్ పైన్ చేసిన తప్పిదాన్ని పశ్చాతాపం వ్యక్తం చేశాడు.

బాల్ టాంపరింగ్ ఉదంతంతో...

బాల్ టాంపరింగ్ ఉదంతంతో...

2018లో అప్పటి కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని నిషేధానికి గురైన విపత్కర పరిస్థితుల్లో టిమ్ పైన్‌ ఆస్ట్రేలియా టెస్ట్ పగ్గాలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మూడేళ్లు కెప్టెన్‌గా కొనసాగి చివరికి ఇలా రాజీనామా చేశాడు. అయితే వచ్చేనెల 8 నుంచి ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా టీమ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన యాషెస్‌ సిరీస్‌ ఆడనుంది. ఈ మెగా టోర్నీకి ముందు పైన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఆ జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. టిమ్ పైన్ అనూహ్య నిర్ణయంతో ఆసీస్ జట్టును వైస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నడిపించే అవకాశాలున్నాయి. అదే జరిగితే

65 ఏళ్ల తర్వాత ఓ ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియాకు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Story first published: Friday, November 19, 2021, 17:55 [IST]
Other articles published on Nov 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+