Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెన్ స్టోక్స్ వల్ల వారికి తీవ్ర అన్యాయం!

సిడ్నీ: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ విమర్శలు గుప్పించాడు. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రపంచకప్ కోసం యూటర్న్ తీసుకోవడాన్ని తప్పుబట్టాడు. అతని కారణంగా ఇన్నాళ్లు జట్టు కోసం ఆడి ప్రపంచకప్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డాడు.

గతేడాది వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. అప్పటి నుంచి అతను వన్డేలకు దూరంగానే ఉన్నాడు. అయితే భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్, హెడ్ కోచ్ మాథ్యూ మోట్ విజ్ఞప్తి మేరకు స్టోక్స్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు.

Tim Paine slams Ben Stokess return to ODI squad ahead of World Cup 2023

జట్టు కోసం తాను వన్డే ప్రపంచకప్ ఆడుతానని తెలిపాడు. దాంతో అతన్ని వన్డే ప్రపంచకప్ ప్రాథమిక జట్టుతో పాటు న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే బెన్ స్టోక్స్ యూటర్న్ తీసుకోవడాన్ని టీమ్ పైన్ తప్పుబట్టాడు.

'బెన్‌ స్టోక్స్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. అతని వ్యవహరం ఎలా ఉందంటే.. నా ఇష్టం ఉన్నట్లు ఆడుతా. నాకు నచ్చిన టోర్నీ ఆడుతా. కేవలం పెద్ద టోర్నీల్లో మాత్రమే బరిలోకి దిగుతానన్నట్లుగా ఉంది. ఇలా చేయడం వల్ల గతేడాది నుంచి ప్రపంచకప్‌లో ఆడాలనే లక్ష్యంతో శ్రమించిన ఇతర ఆటగాళ్ల అవకాశాలను దెబ్బతీసినట్లు అవుతుంది.

అలాంటి యువ క్రికెటర్లతో 'సారీ, నువ్వు వెళ్లి రిజర్వ్‌ బెంచ్‌పై కూర్చో. నేను ఇప్పుడు ఆడాలని అనుకుంటున్నా' అని బెన్ స్టోక్స్ చెప్పినట్లుగా ఉంది. స్టోక్స్ కారణంగా హ్యారీ బ్రూక్‌ విషయంలోనే అన్యాయం జరిగినట్లు అనిపిస్తోంది. ఇటీవల బెన్‌ స్టోక్స్ బౌలింగ్‌ కూడా చేయడం లేదు. అలాంటప్పుడు బ్యాటర్‌గా బెన్‌ స్టోక్స్ లేదా హ్యారీ బ్రూక్? ఎవరు బెస్ట్‌ అనే ప్రశ్న తలెత్తడం సహజం.

డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఇంగ్లండ్‌ జట్టును అందరూ ఫేవరేట్‌గా భావిస్తున్నారు. సెమీస్‌కు చేరే నాలుగింట్లో ఆస్ట్రేలియాతో పాటు భారత్, ఇంగ్లండ్‌ తప్పక ఉంటాయి'' అని టిమ్‌ పైన్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, August 19, 2023, 20:37 [IST]
Other articles published on Aug 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+