గావస్కర్ మాటలు అతనిష్టం.. అవేం నన్ను బాధపెట్టవు: టిమ్ పైన్

బ్రిస్బేన్: టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తనపై చేసిన విమర్శలను పట్టించుకోనని, అవి తనని ఏమాత్రం ప్రభావితం చేయవని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్ అన్నాడు. తన గురించి ఏమి మాట్లాడినా పర్వాలేదని తెలిపాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టు చివరి రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి బ్యాటింగ్ చేస్తుండగా.. సహనం కోల్పోయిన పైన్ స్లెడ్జింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే.
అశ్విన్‌ను అతడు దూషించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పైన్ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ క్రమంలోనే గవాస్కర్ పైన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ కెప్టెన్‌గా పైన్ పనికిరాడని, పైన్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని, కొన్ని క్యాచ్‌లు కూడా వదిలేశాడని గావస్కర్ విమర్శించాడు.

గవాస్కర్ తిట్టాడు కదా..?
కాగా, బ్రిస్బేన్ టెస్టు ముందు మీడియా సమావేశంలో ఓ మీడియా ప్రతినిధి ఇదే విషయాన్ని టిమ్‌పైన్ ముందు ప్రస్తావించాడు. 'గవాస్కర్ మాటలు విన్నారా' అని అడిగాడు. దానికి ఆస్ట్రేలియా కెప్టెన్.. 'సన్నీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. అవి నాపై ఏమాత్రం ప్రభావం చూపవు. కాబట్టి ఆయన ఏం అనాలనుకున్నా అనుకోవచ్చు. దాంతో నేను చేసేదేం లేదు. నా కెరీర్ మొత్తం మంచి ప్రదర్శన చేశాను. కానీ, సిడ్నీ టెస్టులో అలా జరిగిపోయింది' అని బదులిచ్చాడు.

సిడ్నీలో నాటైమ్ బాలేదు..
అయితే, ఈ వివాదాన్ని కొనసాగిస్తారా అని అడిగిన ప్రశ్నకు 'నేను నాలానే ఉంటాను. ఇప్పటికి ఎన్ని టెస్టులు ఆడానో తెలీదు.. కానీ, ఆడినన్ని మ్యాచ్‌లు మంచి ఉద్దేశంతోనే ఆడాను. ఇక సిడ్నీలో జరిగింది వేరు. ఆ మ్యాచ్‌లో నాటైమ్ బాలేదు. నేనెప్పుడు ఆరోగ్యకరమైన పోటీని ఇష్టపడతా. అయితే, స్టంప్‌మైక్‌ను దృష్టిలో పెట్టుకొని అందరినీ గౌరవించాలి' అని పైన్ పేర్కొన్నాడు.అలాగే సిడ్నీలో పలు క్యాచ్‌లు వదిలేయడంపై స్పందించిన పైన్ అందుకు రెండు కారణాలున్నాయని చెప్పాడు. ఒకటి తాను కంగారు పడి క్యాచ్‌లు వదిశానని, ఇంకొకటి టెక్నికల్ సమస్యలతో వదిలేశానని సమర్థించుకున్నాడు.

స్మిత్ బ్యాట్‌తోనే బదులిస్తాడు..
అలాగే స్టీవ్‌స్మిత్ ఉదంతంపై స్పందిస్తూ అదో అనవసరపు వివాదం అని వ్యాఖ్యానించాడు. 'స్మిత్ రిషభ్‌పంత్ బ్యాటింగ్ గార్డ్‌ను చెరిపేయలేదు. గత మూడేళ్లుగా స్మిత్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో అందరికీ తెలుసు. బాల్ టాంప్‌రింగ్ వివాదం తర్వాత ఏడాది పాటు నిషేధానికి గురై తిరిగి జట్టులోకి వచ్చినప్పటి నుంచీ అతను ఇలాంటి వివాదాలు ఎదుర్కొంటున్నాడు. స్మిత్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనిపై వచ్చే విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. ఇక గబ్బా టెస్టులోనూ స్మిత్ చెలరేగిపోతాడని ఆసీస్ కెప్టెన్ ధీమా వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications